జూనియర్ ఎన్టీఆర్ కు వాచ్ లు అంటే చాలా చాలా ఇష్టం. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ దగ్గర వాచ్ ల కలెక్షన్ చాలా ఉంది. ఎక్కడెక్కడి వాచీలు ఆయన తెప్పించుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. ఏదైనా బ్రాండెడ్ కొత్త వాచ్ నచ్చిందంటే చాలు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టైనా దాన్ని కొనుగోలు చేస్తుంటారు.. ఇప్పటికే ఎన్నో వాచ్ లు ఉన్నాయి.. తాజాగా మరో బ్రాండెడ్ వాచ్ ను ఎన్టీఆర్ ధరించారు.. ఆ వాచ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఎన్టీఆర్ ఈరోజు ముంబై విమానాశ్రయంలో కనపడ్తాడు. అందరి దృష్టీ ఆయన చేతికి ఉన్న అద్భుతంగా మెరుస్తున్న వాచ్ పై పడింది. తన చేతికి అల్ట్రా-మోడల్ కాస్ట్రలీ చేతి వాచ్ ధరించారు. ఆ ఫోటోలలో ఎన్టీఆర్ ధరించిన వాచీపై నెటిజన్ల దృష్టి పడింది. దీని ధర ఎంత ఉంటుందబ్బా అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసిన వారు, దాని రేటు చూసి అవాక్కవుతున్నారు.
ఎన్టీఆర్ ధరించిన ఆ వాచ్ రిచర్డ్ మిల్లే RM 40-01. Richard Mille RM 40-01 Tourbillon McLaren Speedtail వాచి స్పెషల్ ఎట్రాక్షన్ గా కనిపించింది. ఈ వాచి ఖరీదు రూ. 7.47 కోట్లు! (సుమారుగా.)
దాంతో ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తారక్ గతంలో RRR ప్రమోషన్స్ లో పాటక్ ఫిలిప్ నాటిలస్ 5712 1/A మోడల్ వాచ్ పెట్టుకొని కనిపించాడు. దాని రేటు ఇండియన్ కరెన్సీలో రూ. 1 కోటి 56 లక్షల పైనే ఉంటుంది..