
భారతీయ సినిమా ప్రపంచంలో అద్బుతమైన నటుడు, యాక్టింగ్ ఎన్సైక్లోపీడియా అంటే గుర్తొచ్చే పేరు కమల్ హాసన్. ‘సాగర సంగమం’లోని కళాకారుడు నుంచి, ‘భారతీయుడు’లోని ఫ్రీడమ్ ఫైటర్ వరకు… ‘విక్రమ్’లో మాస్ యాక్షన్ హీరో నుంచి, ‘దశావతారం’లో పది విభిన్న పాత్రల వరకు – ఆయన చూపించిన నటన రేంజ్ ఎవరూ చేరుకోలేనిది. అందుకే ఇప్పటికీ కమల్ కొత్త సినిమా అనౌన్స్ చేస్తే అభిమానులు “ఈసారి ఏమి కొత్త చూపిస్తాడు?” అని ఆత్రంగా ఎదురుచూస్తారు. ఇప్పుడైతే రెండు ఫెయిల్యూర్స్ అయినా ఆయన ఎక్కడా తగ్గలేదు. మళ్లీ పెద్ద ప్లాన్‌తో ముందుకొచ్చాడు.
కమల్ హాసన్ వరుసగా మూడు సినిమాలు ఫిక్స్ చేశాడు.
అన్నీ ఆయన సొంత బ్యానర్ RKFI (రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్) లోనే వస్తాయి.
మొదటిది ఇప్పటికే అనౌన్స్ అయిన KH237 – యాక్షన్ మాస్టర్స్ అన్బరివ్ తో.
రెండోది ‘చిత్త’, ‘వీర ధీర సూరన్’ ఫేమ్ సూ. అరుణ్‌కుమార్ దర్శకత్వంలో.
మూడోది అయితే ఇండస్ట్రీని షేక్ చేసే కమల్ – రజనీకాంత్ మల్టీస్టారర్!
కేవలం నటుడు, నిర్మాతగానే కాదు… కథ, స్క్రీన్‌ప్లేలోనూ డైరెక్ట్‌గా ఇన్‌వాల్వ్ అవుతున్నారు కమల్.
అయితే అభిమానలు ఎదురుచూసేది ఒకటే “విక్రమ్ లాంటి మరో బ్లాక్‌బస్టర్ వస్తుందా?” అన్నదే ! ఈ మూడు సినిమాల్లో ఒకటి హిట్ కొట్టినా మళ్ళీ పూర్తి ఫామ్ లో ఉంటాడు కమల్ అనేది మాత్రం నిజం.
