బాలీవుడ్‌కి ఓ తీయని గుర్తుగా నిలిచిపోయిన ‘కాంటా లగా’ గర్ల్ షఫాలీ జరివాలా ఇక లేరు. శుక్రవారం రాత్రి గుండెపోటుతో 42 ఏళ్ల వయసులో ఆమె ఆకస్మికంగా కన్నుమూశారు. షఫాలీ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో ఆమె భర్త పరాగ్ త్యాగి ఆమెను ముంబై అంధేరిలోని బెల్లేవ్యూ ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఒకే ఒక్క రీమిక్స్ సాంగ్‌తో దేశమంతా గుర్తించేలా చేసిన అరుదైన ప్రతిభ షఫాలీది.

2005లో విడుదలైన ‘కాంటా లగా’ రీమిక్స్ పాటతో యువతలో ఆమె సెన్సేషన్ అయింది. మ్యూజిక్ వీడియోలో ఆమె ఎనర్జీ, గ్లామర్, స్టైల్ ఎంతో మందిని ఆకట్టుకుంది. అప్పటి నుంచే ఆమెను ‘కాంటా లగా గర్ల్’ అనే ట్యాగ్ ఫాలో అవుతోంది.

తర్వాత సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ‘ముజ్సే షాదీ కరోగీ’ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించారు. అనంతరం టీవీ రియాలిటీ షోలు, వెబ్ సిరీస్‌లలో యాక్టివ్‌గా ఉన్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ హిందీ సీజన్ 13లో ఆమె కనపడడం మరోసారి ఆమెను లైమ్‌లైట్‌లోకి తీసుకొచ్చింది.

సోషల్ మీడియాలోను షఫాలీ చురుగ్గా ఉండేది. ఇన్‌స్టాగ్రామ్‌లో 3.3 మిలియన్ ఫాలోవర్లను కలిగి ఉంది. అంతటి ఆదరణ ఉన్న నటిమరనం అభిమానుల్లో తీవ్ర విషాదం నింపింది.

సింగర్ మికా సింగ్, ఆమె మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, “ఇది నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆమె ఓ అందమైన మనిషి, గొప్ప వ్యక్తిత్వం” అంటూ పేర్కొన్నారు.

,
You may also like
Latest Posts from