
రేపట్నుంచి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న కాంతార చాప్టర్ 1కి ప్రేక్షకులలో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే అన్ని భాషల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అసలు ప్లాన్ ప్రకారం ఈరోజే అన్ని రీజియన్లలో పెయిడ్ ప్రీమియర్స్ పెట్టాలని టీమ్ నిర్ణయించుకుంది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రీమియర్ షోలు రద్దయిపోయాయి.
ఇకపై షోలు రేపటినుంచే ప్రారంభమవుతాయి. ప్రేక్షకుల కోసం ఒక స్పెషల్ ఆఫర్‌ను తీసుకొచ్చింది District యాప్. టికెట్ కొంటే ఒకటి ఫ్రీ ఆఫర్‌ను లిమిటెడ్ క్వాంటిటీకి అందిస్తున్నారు. కాబట్టి త్వరగా బుకింగ్స్ చేసుకుంటే లాభం.
అయితే కాంతార చాప్టర్ 1కి ఇప్పటివరకు వచ్చిన బుకింగ్స్ ఓకే రేంజ్‌లో ఉన్నాయే కానీ KGF 2లా మాసివ్‌గా లేవు. అయినా రేపటి ఓపెనింగ్స్ బాగానే వుంటాయని, తర్వాత సినిమా వర్డ్ ఆఫ్ మౌత్ మీదే దాని ఫైనల్ రేంజ్ ఆధారపడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
కాంతార: చాప్టర్ 1 విషయానికొస్తే.. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ‘కాంతార’ చిత్రానికి ప్రీక్వెల్ ఇది. ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్ క్రియేట్ అంచనాలను భారీగా పెంచింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది.
