బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఇవాళ (జనవరి 16) ఉదయం తెల్లవారు ఝామున ఊహించని విధంగా కత్తిపోట్లకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయంపై సైఫ్ అలీఖాన్ భార్య, హీరోయిన్ కరీనా కపూర్ టీమ్ ఈపాటికే అధికారిక ప్రకటన విడుదల చేసింది. గురువారం తెల్లవారుజామున సైఫ్, కరీనాలు నివసిస్తున్న బాంద్రా ఇంట్లో ఈ దాడి జరిగింది. అయితే ఆ కత్తిపోట్లు జరిగినప్పుడు భార్య కరీనా ఇంట్లో లేదా …ఎక్కడున్నారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సైఫ్ పై హత్యాయత్నం జరిగిన సమయంలో కరీనాకపూర్ ఇంటి వద్దలేరు. ఆమె తన స్నేహితులతోనూ, సోదరి కరిష్మా కపూర్ తోనూ, క్లోజ్ ప్రెండ్స్ సోనమ్, రేహా కపూర్ తోనూ గర్ల్స్ నైట్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ ఎటాక్ జరిగిందని తెలిసిన వెంటనే హుటాహుటిన హాస్పటిల్ కు పరుగెత్తుకు వచ్చింది.
ఈ క్రమంలో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్ ఖాన్ నివాసంలో దుండగుడు చోరీకి యత్నించినట్లు కరీనా టీమ్ మీడియాకు ఓ ప్రకటనలో తెలిపింది.
“సైఫ్ చేతికి గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మిగతా కుటుంబ సభ్యులంతా క్షేమంగానే ఉన్నారు” అని ఆ ప్రకటనలో కరీనా కపూర్ పేర్కొంది.
అలాగే, ఎలాంటి ఊహాగానాలు చేయొద్దని, ఇప్పటికే పోలీసులు కావాల్సిన దర్యాప్తు చేస్తున్నందున ఓపిక పట్టాలని, ఇకపై ఎలాంటి ఊహాగానాలు చేయవద్దని మీడియాను కోరుతున్నామని ఆ ప్రకటనలో కరీనా కపూర్ పేర్కొంది.
కరీనా కపూర్ ఖాన్ సంతకం చేసి ఇచ్చిన మీడియా ప్రకటన వైరల్ అవుతోంది. ఎలాంటి పుకార్లు చేయవద్దని మీడియాను కోరింది కరీనా కపూర్. “మీడియా, అభిమానులు ఓపిక పట్టాలని కోరుతున్నాం. ఇది పోలీసుల వ్యవహారం. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేస్తాం” అని ఆ ప్రకటనలో కరీనా కపూర్ చెప్పుకొచ్చింది.