
హైదరాబాద్ ఎల్ బీ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన ‘ఓజీ కాన్సర్ట్’ వేదిక పవర్‌స్టార్ అభిమానుల తో కిక్కిరిసిపోయింది. అయితే ఈ OG కాన్సర్ట్ ని వర్షం దెబ్బ కొట్టింది. చాలా సంబరంగా జరుగుతుందనుకొన్న ఈ ఈవెంట్ హడావుడిగా ముగించేయాల్సి వచ్చింది. పవన్ కల్యాణ్ తప్ప.. ఎవరూ మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. అయితే వర్షం పడుతూనే ఉండగా, ఆ వర్షంలో తడుస్తూ అభిమానులతో మాట్లాడిన పవన్ కల్యాణ్ మాటలు అక్కడి వాతావరణాన్ని మరింత ఎమోషనల్‌గా మార్చేశాయి.
“ప్రేక్షకులు నాకు ఇంత ప్రేమ ఇస్తారని ఊహించలేదు. ఈ స్థాయి స్పందన నేను చివరిసారి ‘ఖుషీ’ సమయంలోనే చూశాను. రాజకీయాల్లోకి వెళ్లినా మీరు నన్ను వదల్లేదనేది ఈ స్పందన చెబుతోంది” అంటూ పవన్ కల్యాణ్ హృదయపూర్వకంగా చెప్పారు.
Nenu Japan lo putti, periganu. Tokyo veedhi badi lo chaduvukunnanu 🔥💥
— Praneeth Chowdary (@praneethballa) September 21, 2025
– #PawanKalyan’s mass dialogue at the #OGPreReleaseEvent#TheyCallHimOG pic.twitter.com/e2maPuayyy
జపనీస్ హైకూ & ‘వాషి యో వాషి’ సాంగ్ సీక్రెట్
“సుజీత్ పట్టుబట్టడం వల్లే సినిమాలో వేసుకున్న కాస్ట్యూమ్‌లోనే ఇక్కడికి రావాల్సి వచ్చింది. నేను పాడిన ‘వాషి యో వాషి’ నిజానికి ఒక జపనీస్ హైకూ. ఇది హీరో – విలన్ క్యారెక్టర్ల మధ్య ఉన్న ఎత్తు తేడాని చూపిస్తుంది. అసలే పాడాలనుకోలేదు. కానీ తమన్, ప్రేక్షకుల కోరికకు లొంగి పాడా” అని పవన్ క్లారిటీ ఇచ్చారు.
“డిప్యూటీ సీఎం అన్న సంగతే మరిచిపోయాను”
“నిజంగా ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పట్టుకుని వస్తే ఊరుకుంటారా?” అంటూ నవ్వించారు పవన్. ‘ఖుషీ’లో నేర్చుకున్న కటానా ప్రాక్టీస్ ఈ సినిమాలో కూడా ఉపయోగపడిందని చెప్పారు. అలాగే ప్రియాంక మోహన్‌తో ఉన్న లవ్ ట్రాక్ చిన్నదే అయినా చాలా హృద్యంగా ఉందని అన్నారు.
సుజీత్ – తమన్ లకు పవన్ స్పెషల్ క్రెడిట్
“ఈ సినిమాలో అసలు స్టార్లు నేను కాదు, సుజీత్ – తమన్. వీళ్లిద్దరూ సినిమా అంతా ఒక ట్రాన్స్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఆ ట్రాన్స్‌లోకి నన్నూ లాగేశారు. సుజీత్ లాంటి యంగ్ టీమ్ నేను డైరెక్టర్‌గా ఉన్నప్పుడు దొరికుంటే, రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదేమో” అని షాకింగ్‌గా కామెంట్ చేశారు పవన్.
చివరగా… అభిమానులకే క్రెడిట్
“నాకు భవిష్యత్తు ఇచ్చింది మీరే. నేను ధైర్యంగా రాజకీయాల్లో పోరాడుతున్నానంటే దానికి కారణం మీరే. సినిమా చేస్తే ఆ సమయంలో నాకు ఇంకో ఆలోచన ఉండదు” అంటూ ఫ్యాన్స్‌కు పవర్‌ఫుల్ మెసేజ్ ఇచ్చారు.
ఈ వేడుకకు అల్లు అరవింద్, దిల్ రాజు, నవీన్ యెర్నేని, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, తమన్ తదితరులు హాజరయ్యారు.
చివరగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహకారం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పవన్ కల్యాణ్.
ఇక వర్షంలో తడుస్తూనే ఫ్యాన్స్ ముందు “వాషి యో వాషి” పాడిన పవన్ కల్యాణ్ విజువల్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతున్నాయి!
