ఓ హిట్ సినిమా తర్వాత ఆ హీరో చేసే సినిమాకు ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది. అలాగే ‘క’ తర్వాత నటుడు కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaraam) నటించిన సరికొత్త చిత్రం ‘దిల్‌ రూబా’ (Dil Ruba) పై మంచి అంచనాలే ఉన్నాయి. విశ్వకరుణ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రుక్సర్‌ థిల్లాన్‌ హీరోయిన్. మనసుని హత్తుకునే ప్రేమ కథతో ఇది రూపొందుతున్నట్లు చెప్తున్నారు. మార్చి 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర టీమ్ తాజాగా ‘దిల్‌ రూబా’ ట్రైలర్‌ను విడుదల చేసింది.

ఈ ట్రైలర్ లో డైలాగులు ఇంట్రస్టింగ్ గా ఉన్నాయి.

”త‌ప్పు జ‌రిగిపోయిన త‌ర‌వాత చెప్పే సారీకీ
అవ‌స‌రం తీరిపోయిన త‌ర‌వాత చెప్పే థ్యాంక్స్‌కీ నా దృష్టిలో వాల్యూ లేదు” అనే డైలాగ్ తో ట్రైల‌ర్ మొద‌లైంది. ఈ డైలాగ్ తో హీరో క్యారెక్ట‌రైజేష‌న్ మొత్తం చెప్పేశారు. హీరోకి సారీ, థ్యాంక్స్ ఇవి రెండూ చెప్పే అల‌వాటు లేదు. అదే… ఈ డైలాగ్ లో ప్ర‌జెంట్ చేశారు.

”త‌ప్పు చేయ‌ని ప్ర‌తోడూ నా దృష్టిలో హీరోనేరా. వాడు చేసిన త‌ప్పు రియ‌లైజ్ అయిన‌వాడు ఇంకా పెద్ద హీరో”

‘చూడ్డానికి ఐస్ క్రీమ్ లా ఉన్నావ్.. తిరి పార‌దొబ్బుతా’

‘మీ ఆడోళ్ల కోసం మా మ‌గాళ్లు యుద్ధాలు చేసినా మీక‌ర్థమై చావ‌దే’

‘దేవుడు ఎప్పుడు మాట్లాడ‌డం మానేశాడో తెలుసా నీకు. మ‌నిషి మోసం చేయ‌డం మొద‌లెట్టిన‌ప్పుడు’

నటీనటుల పాత్రలను పరిచయం చేస్తూ ఈ ట్రైలర్‌ సాగింది. ప్రేమికుడి పాత్రలో కిరణ్‌ అబ్బవరం యాక్టింగ్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లు అలరించేలా ఉన్నాయి.

,
You may also like
Latest Posts from