ధనుష్ (Dhanush) హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కుబేర’ (Kubera). జూన్‌లో థియేటర్స్‌లోకి రానున్నారు ‘కుబేర’. ధనుష్, నాగార్జున హీరోలుగా నటిస్తున్న పాన్–ఇండియన్ మూవీ ‘కుబేర’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్నారు.
తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ బహుభాషా చిత్రంలో బాలీవుడ్ నటుడు జిమ్ సర్భ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి తొలి సాంగ్ విడుదలైంది.
‘పోయి రా మావా’ అంటూ సాగే ఈ పాటను ధనుష్ ఆలపించారు. భాస్కర్ భట్ల లిరిక్స్ అందించగా.. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. జూన్ 20న ఈ సినిమా విడుదల కానుంది.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్‌రావు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.