
మహిళా సూపర్‌హీరో సినిమా ‘లోకా’…అదే రోజున రిలీజ్ అయిన పలు సినిమాల పోటీలోనూ బాక్సాఫీస్‌ను కుదిపేస్తూ మాలీవుడ్ రికార్డులన్నీ తిరగరాసింది.‘లోక చాప్టర్ 1: చంద్ర’ (తెలుగులో కొత్త లోక) చిత్రంతో థియేటర్లు హౌస్ ఫుల్స్ అవుతున్నాయి. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) నిర్మించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ రూ.కోట్లు వసూలు చేస్తోంది. దీనిపై కల్యాణి ప్రియదర్శన్ ఆనందం వ్యక్తంచేశారు. దేశంలోనే మొదటి ఫీమేల్ సూపర్ హీరో సినిమాలో నటించడం గర్వంగా ఉందన్నారు.
ఇక ఈ ఏడాది రిలీజ్ అయిన మోహన్‌లాల్ ‘ఎంపురాన్’ 265 కోట్లు గ్రాస్ వసూలు చేసి, రివ్యూలు బాగోలేకపోయినా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అంతకుముందు ‘మంజుమ్మెల్ బాయ్స్’ సృష్టించిన రికార్డుని దాటేసింది. ఇక ఇప్పుడు ‘లోకాహ్: చాప్టర్ 1 చంద్రా’ అదే ‘ఎంపురాన్’ రికార్డును దాటేసి, మాలీవుడ్ నంబర్ 1 ఇండస్ట్రీ హిట్‌గా అవతరించబోతోంది.
కేరళలోనే 100 కోట్ల క్లబ్ చేరుకోబోతోందన్న అంచనాలు ఫ్యాన్స్ కు కిక్ ఇస్తున్నాయి. అంతే కాదు, మోహన్‌లాల్ ‘తుదరుం’ (119 కోట్లు) రికార్డుని కూడా చేజ్ చేసే అవకాశం బలంగా కనిపిస్తోంది.
రూ.30 కోట్ల సినిమా.. రూ.200 కోట్లు వసూలు
డామినిక్ అరుణ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకువచ్చింది. దుల్కర్ దీన్ని రూ.30 కోట్లతో నిర్మించగా.. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా రూ.200కోట్లు వసూళ్ళు దాటేసి, 300 కోట్ల వరకూ పరుగులు తీస్తోంది. దేశవ్యాప్తంగా అత్యధిక వసూలు సాధించిన నాలుగో మలయాళ చిత్రంగా నిలిచింది.
