బాలీవుడ్ నటి శిల్పా శెట్టి మరియు ఆమె భర్త రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులు కొత్త షాక్ ఇచ్చారు. ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల విలువైన మోసంలో నిందితులుగా తేలిన ఈ జంటకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
ఈ కేసు ఓ కమర్షియల్ ఎగ్రిమెంట్ కు సంబంధించినది. ముంబై వ్యాపారవేత్త దీపక్ కొఠారి ఫిర్యాదు చేసిన తర్వాత జుహు పోలీసులు ఆగస్టు 14న కేసు నమోదు చేశారు. అప్పటి నుండి విచారణ కొనసాగుతుండగా, దంపతులు తరచూ విదేశీ పర్యటనలకు వెళ్ళడంతో, ముంబై EOW ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
కొఠారి ఆరోపణల ప్రకారం, 2015 నుండి 2023 మధ్య , ఆ దంపతులు వ్యాపార విస్తరణ కోసం అని చెప్పి అతనికి నుంచి రూ. 60 కోట్లు సేకరించారు. అలాగే 12% వార్షిక వడ్డీతో చెల్లిస్తామని వాగ్దానం చేసారని, శిల్పా శెట్టి స్వయంగా 2016 ఏప్రిల్లో పర్శనల్ గ్యారెంటీ అందించారని చెప్పారు.
లుకౌట్ సర్క్యులర్ అంటే ఏమిటి?
కేసు విచారణ సమయంలో ఎవరికీ దేశం విడిచి పారిపోకుండా యాత్రలను నియంత్రించేందుకు జారీ చేసే ఆర్థిక నేరాల విభాగం (EOW) చర్య.