శివకార్తికేయన్ హీరోగా స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా మదరాసి. వరుస విజయాలతో దూసుకెళ్తున్న శివ కార్తికేయన్ కు కోలీవుడ్ అగ్ర దర్శకుల్లో ఒకడైన మురుగదాస్ కలవడంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది.

మురుగదాస్ కు దాదాపు ఏడేళ్లుగా సరైన హిట్ లేకపోయినా ఈ సినిమాపై ముందు నుంచి పాజిటివ్ బజ్ వస్తోంది. అయితే దీనికి కారణం లేకపోలేదు. తన చివరి మూడు సినిమాలతో ట్రాక్ తప్పిన మురుగదాస్.. తనకు కలిసొచ్చిన యాక్షన్ థ్రిల్లర్ తో మళ్ళీ తన రూట్ లోకి వచ్చేశాడు. తమిళనాట ఎంతగానో ఎదురు చూస్తున్న మదరాసి ట్రైలర్ ఆదివారం (ఆగస్టు 24) రిలీజ్ అయింది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో తెలుగు రైట్స్ కు భారీ రైట్లు చెప్తున్నారని తెలుస్తోంది.

శివకార్తికేయన్ గత చిత్రం అమరన్* తెలుగు రాష్ట్రాల్లోనూ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేసింది అనడంలో సందేహమే లేదు. అయితే, ఆయన కొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్ మదరాసి కోసం నిర్మాతలు తెలుగు డబ్బింగ్ రైట్స్‌పై విపరీతమైన డిమాండ్ చేస్తున్నారని టాక్. సమాచారం ప్రకారం, రైట్స్ ధరను దాదాపు ₹14 కోట్లుగా కోట్ చేశారని వినికిడి.

డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఈ రేటు అసలు రియలిస్టిక్ కాదని అంటున్నారు. “ఎక్కువలో ఎక్కువ ₹7 కోట్ల వరకే ఆగాలి. తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు చాలా సెలెక్టివ్‌గా మారిపోయారు. ‘అమరన్’ లాంటి దేశభక్తి బయోపిక్‌కు వచ్చిన క్రేజ్, ‘మదరాసి’కి రావడం కష్టమే” అని ఒక డిస్ట్రిబ్యూటర్ వ్యాఖ్యానించాడు.

అమరన్ లో శివకార్తికేయన్, సాయి పల్లవి నటనతోనే తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు ₹46 కోట్లు వసూలయ్యాయి. కానీ మదరాసి మాత్రం ప్యూర్ కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్. ఈ సినిమాను గజినీ ఫేమ్ ఏఆర్ మురుగదాస్ డైరెక్ట్ చేస్తుండటమే మరో హైలైట్. ట్రైలర్‌లోనూ ఇలీగల్ గన్స్ ట్రేడ్ చుట్టూ సాగే కథ, మాస్ యాక్షన్, రొమాన్స్ ప్యాకేజీగా చూపించారు.

శివకార్తికేయన్ ఇంటెన్స్ లుక్‌లో కనిపించగా, హీరోయిన్ రుక్మిణి వసంత్‌కు కూడా గ్లామర్‌కే పరిమితం కాని పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ దక్కింది.

ఇండస్ట్రీ టాక్ ప్రకారం, రజినీ, విజయ్, సూర్య, కార్తి లాంటి తమిళ స్టార్స్ తెలుగు మార్కెట్‌లో డబ్బింగ్ సినిమాలకు ₹25–₹50 కోట్ల వరకు వసూలు చేస్తున్నారు. అదే మోడల్‌లో మేకర్స్ రేటు పెంచారని అనిపిస్తోంది. కానీ నిజమైన పరీక్ష మాత్రం మదరాసి రాబోయే కలెక్షన్స్‌దే. ఈ సినిమా ఓపెనింగ్స్, వసూళ్లపై ఆధారపడి శివకార్తికేయన్ తెలుగు మార్కెట్‌లో డబుల్ డిజిట్ రేంజ్‌ను కన్సాలిడేట్ చేసుకోగలడో లేదో తేలనుంది.

ఈ ధర తెలుగు బయ్యర్స్ రిస్క్ చేసేలా ఉందా? లేక శివకార్తికేయన్ మదరాసి తో నిజంగానే కొత్త మార్కెట్ రేంజ్ క్రియేట్ చేస్తాడా?

, , ,
You may also like
Latest Posts from