2024లో ఎన్నో అద్భుతమైన కథలను ప్రేక్షకులకు అందించింది మలయాళ చిత్ర పరిశ్రమ. యువ, యంగ్ హీరోలతో విభిన్న చిత్రాలతో ఎంటర్ట్నైమెంట్ ని పంచారు. ఆ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఎన్నో సినిమాలు వేరే భాషల్లోనూ విజయాలు అందుకున్నాయి. అయితే.. ఈ ఏడాది తమకు రూ.700 కోట్ల నష్టం వాటిల్లిందని కేరళ చిత్ర నిర్మాతల అసోసియేషన్ పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. అందుకు కారణం నిర్మాణ విలువ, హీరోల పారితోషికం భారీగా పెరగడం వల్ల తమకు రావాల్సిన ఆదాయం భారీగా తగ్గిందని పేర్కొంది. అయితే ఇప్పుడు ఈ మేరకు యాక్షన్ తీసుకుంటోంది.
జూన్ 1 నుండి మలయాళ సినీ పరిశ్రమ పూర్తిగా షట్ డౌన్ కానుంది. ఆ రోజు నుండి సినిమా షూటింగ్స్ జరగవు, డిస్ట్రిబ్యూషన్ ఆగిపోతుంది, సినిమాలను ఎగ్జిబిట్ కూడా చేయకూడదని ప్రకటించింది. కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ కలిసికట్టుగా ఈ నిర్ణయానికి వచ్చింది.
రెమ్యునరేషన్ అమాంతం పెంచేసిన ఇతర టెక్నీషియన్స్‌కు బుద్ధి చెప్పడం కోసం కేరళ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో స్టార్ హీరోలపై కూడా దెబ్బపడనుంది.
గత సంవత్సరరం ‘మంజుమ్మల్ బాయ్స్’, ‘ఆడు జీవితం’, ‘ఎ.ఆర్.ఎం.’, ‘ఆవేశం’, ‘ప్రేమలు’, ‘భ్రమయుగం’, ‘సూక్ష్మ దర్శిని’ వంటి సినిమాలు విడుదలై విజయాన్ని అందుకున్నాయి. తెలుగులోనూ ఆయా చిత్రాలకు విశేష గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళ చిత్ర నిర్మాతల అసోసియేషన్ ఇలాంటి ప్రకటన విడుదల చేయడం అంతటా చర్చనీయాంశమైంది.