మళయాళ థ్రిల్లర్స్ కు ఓటిటిలో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ క్రమంలో కుంచకో బోబన్ కీలక పాత్రలో రూపొందిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’. జీతూ అష్రాఫ్ తెరకెక్కించిన ఈ సినిమాను రూ.12కోట్లతో తీయగా, మలయాళంలో రూ.50 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.
రీసెంట్ గా తెలుగులో విడుదలైన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
ఫిబ్రవరిలో మలయాళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మార్చి 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, తెలుగులో వచ్చిన వారం రోజుల్లోనే ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌కు సిద్ధమవడం గమనార్హం.
మార్చి 20న ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ మలయాళం, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
చిత్రం స్టోరీ లైన్ ఏమంటే
హరి శంకర్ (కుంచకో బోబన్) నిజాయతీ కలిగిన పోలీస్ ఆఫీసర్. ఒక బంగారు గొలుసు కేస్‌ను విచారిస్తుండగా, ఊహించని విధంగా ఓ పోలీస్ ఆఫీసర్ ఆత్మహత్య కేసు, తన పెద్ద కూతురు సూసైడ్ కేసు కనెక్ట్ అవుతాయి.
ఆ బంగారు చైన్‌కి ఈ రెండు కేసులకి కనెక్షన్ ఏంటి? అనేది ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెట్టిన హరి శంకర్‌కు కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. అసలు ఈ ఆత్మహత్యల వెనుక ఉన్నది ఎవరు? ఈ బంగారు గొలుసును లాగితే డొంక ఎలా కదిలింది? అనేది ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ (Officer On Duty) కథాంశం.