రీసెంట్ గా ‘కూలీ’ సినిమా వచ్చిన తర్వాత సోషల్ మీడియాను షేక్ చేసిన పేరు సౌబిన్ షాహిర్ (Soubin Shahir). ఈ మలయాళ నటుడు …రజనీకాంత్ హీరోగా చేసిన కూలీ (Coolie) సినిమాలో మోనికా.. లవ్ యూ మోనికా అంటూ పూజా హెగ్డే(Pooja Hegde)తో పాటు డ్యాన్స్ చేసి ఫ్యాన్స్ ను ఫిదా చేయడం కాదు షాక్ కు గురిచేశాడు. ఓ రకంగా మోనికా సాంగ్ లో పూజానే డామినేట్ చేశాడు సౌబిన్. ఆమె అందం కన్నా ఎక్కువగా సౌబిన్ డ్యాన్స్ కు ఎనర్జీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ ఒక్క సాంగ్ తోనే సౌబిన్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. అయితే ఇది తెలిసిన విషయమే కదా అంటారా.ఇప్పుడెందుకు ఆ టాపిక్ అంటారా…
‘మంజుమ్మెల్ బాయ్స్’తో పాన్ ఇండియా లెవెల్‌లో హిట్ కొట్టిన మలయాళ స్టార్, ప్రొడ్యూసర్ సౌబిన్ షాహిర్ ప్రస్తుతం పెద్ద ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. ఆ మూవీకి సంబంధించిన ₹7 కోట్లు విలువైన ఆర్థిక మోసం కేసు లో అతడిపై విచారణ జరుగుతోంది. ఈ వ్యవహారంలో అతడి తండ్రి బాబు షాహిర్, సహ నిర్మాత షాన్ ఆంథోని కూడా విచారణను ఎదుర్కొన్నారు.
ఇక తాజాగా, సౌబిన్ దుబాయ్ అవార్డ్స్ ఈవెంట్ కి వెళ్లడానికి కోర్టులో పర్మిషన్ కోరాడు. కానీ, ఎర్నాకులం మేజిస్ట్రేట్ కోర్ట్ అతడి ట్రావెల్ రిక్వెస్ట్‌ను సూటిగా తిరస్కరించింది. దీంతో సెప్టెంబర్ 5న జరిగే వేడుకకు అతడు హాజరుకావడం అసాధ్యమైంది.
గత జూలైలోనే సౌబిన్‌పై మరాడు పోలీస్ విచారణ జరిపింది. అప్పట్లో అతడు ముందస్తు బెయిల్‌పై బయటపడ్డాడు. విచారణ సందర్భంగా అవసరమైన డాక్యుమెంట్స్‌తో పాటు, తన మొబైల్ ఫోన్‌ని కూడా పోలీసులకు ఇచ్చినట్లు మీడియాలో చెప్పుకొచ్చాడు. “పరిస్థితిని పోలీసులు అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. నేను ఇచ్చిన డాక్యుమెంట్స్ చూసి వారు నిజానిజాలు నిర్ధారించుకుంటారు” అని వ్యాఖ్యానించాడు.
ఈ కేసు వెనుక ఉన్న అసలు వ్యక్తి, ఇన్వెస్టర్ సిరాజ్ వలియావీట్టిల్ . ఆయన మాటల్లో – సినిమా నుంచి 40 శాతం లాభం వస్తుందని హామీ ఇచ్చి, కేవలం ₹5.99 కోట్లు మాత్రమే ఇచ్చారట . కానీ, మూవీ మొత్తం ₹240 కోట్లకు పైగా గ్రాస్ సాధించినా, తనకు రావలసిన వాటా ఇవ్వలేదని ఘాటుగా ఆరోపించాడు.
మొత్తం మీద, బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ అయిన ‘మంజుమ్మెల్ బాయ్స్’ వెనుక ఇప్పుడు కోర్ట్ రూమ్ డ్రామా నడుస్తోంది. సక్సెస్‌కి తీపి రుచి దక్కక ముందే, నిర్మాతలకు లీగల్ తలనొప్పులు మొదలయ్యాయి.