సందీప్ కిషన్ హీరోగా, రావు రమేష్ మరో ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మజాకా’. ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే రిలీజై ట్రెండ్ అవుతోంది. ఈ ట్రైలర్ చూస్తుంటే ఈసారి సందీప్ అనుకున్న హిట్, స్టార్‌డమ్ వచ్చేలానే అనిపిస్తుంది. కంటెంట్ పరంగా ఎటువంటి లోటు లేకుండా కనిపించిన ఈ ట్రైలర్, సినిమాగా ఏం చేస్తుందో అని ట్రేడ్ ఎదురుచూస్తోంది. ఈ నేపధ్యంలో చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ డిటేల్స్ బయిటకు వచ్చాయి.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం బడ్జెట్ 30 కోట్లు దాకా అయ్యింది. సందీప్ కిషన్ కెరీర్ లో ఇది పెద్ద బడ్జెట్టే. అదే సమయంలో ఈ సినిమా నాన్ థియేట్రకల్ బిజినెస్ సైతం బాగానే జరిగిందని, నిర్మాతను కంపర్ట్ జోన్ లో ఉంచిందని చెప్తున్నారు.
థియేటర్ బిజినెస్ విషయానికి వస్తేరెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా హక్కులను రూ .9 కోట్ల రూపాయలకు అమ్మరట.. ప్రపంచవ్యాప్తంగా 11 కోట్లకు పైగా ఫెయిల్ అయినట్లు టాకు వినిపిస్తోంది. దాంతో 12 కోట్లు షేర్ (25 కోట్లు గ్రాస్) వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందని చెప్తున్నారు.
‘ధమాకా’ ఫేమ్ త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న ఈ సినిమాను గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాల్లో ఉన్నారు.