ప్రముఖ తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ చేసిన లేటెస్ట్ కామెంట్స్ నెట్టింట పెద్ద దుమారం రేపుతున్నాయి.
” మిగతా భాషల డైరెక్టర్లు కేవలం ఎంటర్‌టైన్ చేస్తారు… కానీ తమిళ డైరెక్టర్లు ఆడియన్స్‌ను ఎడ్యుకేట్ చేస్తారు. అందుకే వెయ్యి కోట్ల సినిమాలు రావు ” అన్న స్టేట్‌మెంట్‌తో ఆయన కొత్త వివాదానికి తెరతీశారు.
ఈ ఒక్క మాటతోనే నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
“సరే గారూ, మీ సినిమాలు ఏం ఎడ్యుకేట్ చేశాయి? స్పైడర్, సికిందర్ లాంటి ఫ్లాప్‌లలో ఏ మెసేజ్ ఉంది?” అంటూ ట్రోల్ చేస్తున్నారు.
కోలీవుడ్ ఇండస్ట్రీకి ఇప్పటికీ 1000 కోట్లు కలెక్షన్స్ అనే కల నెరవేరకపోవడంతో… జైలర్, లియో, విక్రం, కంగువ, కూలీ లాంటి సినిమాలన్నీ కలెక్ట్ చేయలేకపోయాయి. ఈ సెన్సిటివ్ టైమ్‌లో మురుగదాస్ చేసిన వ్యాఖ్యలు మరింత రగడకు కారణమయ్యాయి.
ఇప్పుడు నెటిజన్ల డైలాగ్ ఇదే:
“ఆడియన్స్‌ను ఎడ్యుకేట్ చేస్తామని చెప్పడం కూల్… కానీ 1000 కోట్లు వసూలు చేయడం కాస్త హార్డ్ కదా మురుగదాస్ గారూ?”