తెలుగు సినిమా చరిత్రలో గేమ్‌చేంజర్ గా నిలిచిన రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలోని ‘శివ’ మళ్లీ పెద్ద తెరపైకి రాబోతోంది. 30 ఏళ్లకు పైగా క్రితం విడుదలై, యూత్ మైండ్‌సెట్‌ని, తెలుగు సినిమా స్టైల్‌ని మొత్తం మార్చేసిన ఈ కల్ట్ క్లాసిక్, ఇప్పుడు 4K రీమాస్టర్ మరియు డాల్బీ ఆట్మాస్ సౌండ్‌తో రీ-రిలీజ్ అవుతోంది.
ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చే ‘కూలీ’ సినిమాలో, ఈ రీ-రిలీజ్ వెర్షన్ ఫస్ట్ టీజర్ అటాచ్ చేసి చూపించబోతున్నారు.
అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల జ్ఞాపకార్థం ఈ రీ-రిలీజ్‌ను ప్లాన్ చేస్తోంది. ఒరిజినల్ మోనో సౌండ్‌ని, అత్యాధునిక AI టెక్నాలజీతో కన్వర్ట్ చేసి, ఆడియెన్స్‌కి థియేటర్లో కొత్త లెవెల్ అనుభవం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ –
“శివ నా కెరీర్‌కి టర్నింగ్ పాయింట్. నన్ను ఐకాన్‌గా మలిచింది. ఇంతకాలం తర్వాత కూడా ఈ సినిమా పాపులారిటీ తగ్గకపోవడం అద్భుతం. ఈసారి, ఆన్‌లైన్‌లో మాత్రమే చూసిన కొత్త జనరేషన్‌కి థియేటర్‌లో ఈ మాజిక్ ఫీల్ చేయించాలని అనుకున్నాం.”
రామ్ గోపాల్ వర్మ –
“ఇది నా డ్రీమ్ కమ్ ట్రూ.”
రిలీజ్ డేట్ ఇంకా సస్పెన్స్‌లోనే – కానీ సినీ వర్గాల మాట ప్రకారం, ఈసారి థియేటర్లలో భారీగానే శివ ఎంట్రీ ఉంటుంది!