గత సంక్రాంతికి  2023లో ‘వీరసింహారెడ్డి’ బరిలో దిగి విజయాన్ని అందుకున్న బాలయ్య ఇప్పుడు ‘డాకు మహారాజ్’ తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు.   ట్రైలర్ లో స్టైలిష్ యాక్షన్ కనిపించింది కానీ ఫ్యాన్స్ కోరుకున్న మాస్ బాలయ్య తక్కువయ్యాడనే కామెంట్స్ వినిపించాయి. ఈ క్రమంలో సినిమా ఎలా ఉంది, కథేంటి,  డాకు తో బాలయ్య సక్సెస్ ని కంటిన్యూ చేయగలిగారా? బాబీ, బాలయ్యని ఏ మేరకు కొత్తగా చూపించారు?  

స్టోరీ లైన్

సివిల్ ఇంజీనీర్ సీతారం(బాలయ్య)..చాలా ప్రశాంతంగా తన పని తాను చేసుకుని  పోతూంటాడు. ఎన్నో గ్రామాలకు అతను దేవుడుగా మారతాడు. అలాంటి సీతారాం జీవితంలో జరిగిన ఓ సంఘటనతో డాకూ మహారాజ్ గా టర్న్ అవుతాడు. జీపు దిగి గుర్రం ఎక్కి డాకూగా తిరుగుతూంటాడు. ఆ  పరిస్దితులు ఏమిటి, అతనికి చిన్న పాప వైష్ణవికి ఉన్న కనెక్షన్ ఏమిటి, ఆమెను రక్షించాలనుకోవటానికి కారణం ఏమిటి,  ప్రశాంతంగా సాగిపోతున్న  అతని జీవితాన్ని సమూలంగా మార్చిన సంఘటన ఏమిటి వంటి విషయాలుకు సమాధానమే ఈ సినిమా కథ.

ఏముంది, ఏమి లేదు?

స్టోరీ  పాయింట్ మరీ బలంగా ఏమి లేక పోయినా కూడా ఎక్కడ ఎలాంటి సీన్స్ పడాలి…ఎంత క్వాలిటీ గా సినిమా ఉండాలి లాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు డైరక్టర్ బాబి.  ఎక్స్ లెంట్ క్వాలిటీ తో నిండిపోయిన డాకు మహారాజ్ చివరి అరగంట మాత్రం బాగా  ఫ్లాట్ అయ్యిపోయింది. కాకపోతే అక్కడక్కడా అవకాశం ఉన్నప్పుడల్లా  హై ఇస్తూ సీన్ బై సీన్  ఒక ఫ్లో లో వెళ్ళిపోతుంది.

బాలయ్య ఎప్పటిలాగే తన మాస్ విశ్వరూపం చూపెట్టారు కొన్ని సీన్స్ లో. అలాగే రెగ్యులర్ మాస్ మాసాలా సినిమానే అయినా స్టైలిష్ గా సినిమా సాగుతుంది.  కమల్ హాసన్ విక్రమ్, రజనీకాంత్ జైలర్ లను గుర్తు చేసే ఎపిసోడ్స్  సినిమాలో ఉన్నాయి. అయితే ఆ రెండు సినిమాలు డిఫరెంట్ స్క్రీన్ ప్లేలతో చేసి హిట్ కొట్టిన మ్యాజిక్ లు .  ఆ సినిమా సక్సెస్ చూసి అందులోని ఎలివేషన్స్, పాప సెంటిమెంట్ వంటివి మాత్రమే పట్టుకుని ముందుకు వెళ్ళిన సినిమా ఇది.   అయితే కేవలం ఎలివేషన్స్, స్టైలిష్ విజువల్స్ ఆ చిత్రాల సూపర్ హిట్ కు కారణం కాదు అనే విషయం మర్చిపోయారు.  అవన్నీ కేవలం  సక్సెస్ స్దాయిని మరో స్దాయికి తీసుకెళ్లేందుకు ఉపయోగపడినవి మాత్రమే.  

డాకూ మహారాజ్  సినిమా కోసం డైరక్టర్ బాబి… జైలర్, విక్రమ్ సినిమాలు కు తగ్గ ఎలిమెంట్స్ వచ్చే  నేపధ్యం ఎంచుకున్నారు. కానీ ఆ సినిమాల స్దాయిలో స్క్రీన్ ప్లేని డిజైన్ చేయలేకపోయారు. కానీ గ్యాప్ లో మాత్రం  హీరోయిజం బాగా ఎలివేట్ చేసే సీన్స్ మాత్రం పేర్చుకున్నారు. ఈ క్రమంలో  ఆ సీన్స్ వచ్చినప్పుడు జనం ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా మాస్ డైలాగ్స్  సినిమాకు ఉన్నంతలో ఊపు తెచ్చాయి. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ , ప్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని ఎపిసోడ్స్ బాగున్నాయి. క్లైమాక్స్ కు వచ్చేసరికి  విషయం లేక తేలిపోయింది. రొటీన్ గా ప్రెడిక్టబుల్ క్లైమాక్స్ వచ్చేసింది.

టెక్నికల్ గా..

విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ & థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ రెండు సినిమాకు బాగా ప్లస్ అయ్యాయి. అదే సమయంలో రొటీన్ గా సాగే స్క్రిప్టు, ఎగ్జిక్యూషన్ సినిమాని నేలకు లాగే ప్రయత్నం చేసాయి. ఎక్కడా ఇంట్రస్టింగ్ ట్విస్ట్ లు కానీ ,ఇంటెన్స్ నేరేషన్ కానీ లేకుండా కథ,కథనం నడిపారు. సినిమాలో మెయిన్ విలన్ బాబి డయోల్ పాత్ర అయితే తెరపై ఎన్నో సార్లు చూసిన విలన్ క్యారక్టరే.   పాటల్లో ఎంతో కొంత ఎక్సపెక్ట్ చేసిన  ‘దబిడి దీబిడి’ పాటలో కొరియోగ్రఫీ జస్ట్ ఓకే అన్నట్లుంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

ఫైనల్ గా బాలయ్య అభిమానులకు నచ్చే సినిమా ఇది. మిగతా వాళ్లకు జస్ట్ ఓకే అనిపిస్తుంది.  బాలయ్య చేసిన ఎన్నో రెగ్యులర్  మాస్ మసాలా సినిమాల్లో ఇది ఒకటి. స్టైలిష్ గా తీయటం ఈ సినిమాకు కొత్త. కాబట్టి స్టైలిష్ బాలయ్యను, యాక్షన్ ఎపిసోడ్స్ చూడాలంటే ఈ సినిమాకు వెళ్లచ్చు.  బందిపోటుగా, ప్రభుత్వ అధికారిగా బాలకృష్ణ డిఫరెంట్ షేడ్స్ లో చూడవచ్చు.

,
You may also like
Latest Posts from