నాని సినిమాలు అంటే ఇలా ఉంటాయి అని మనకు ఒక ఆనవాలు. ఫ్యామిలీలకు తగ్గ ప్యాకేజ్ తో నాని వస్తూంటారు. అయితే ఇప్పుడు నాని రూట్ మార్చాడు. తాజాగా మోస్ట్ వైలెంట్ గా ‘హిట్ 3 : ది థర్డ్ కేస్’ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా టీజర్ రిలీజైంది. అందులో విజువల్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

శైలేష్ కొలను దర్శకత్వం వహించిన హిట్, హిట్ 2 సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కావడంతో మరో సీక్వెల్ పై మేకర్స్ దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం డైరెక్టర్ శైలేష్ కొలను ‘హిట్ 3 : ది థర్డ్ కేస్’ సినిమా తో మన ముందుకు వస్తున్నారు.

ఇందులో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నటిస్తున్నాడు అనే వార్త ఆసక్తిని పెంచేసింది. ఇక ఇప్పటి వరకు డీసెంట్ ఫ్యామిలీ మెన్ గా కనిపించిన నాని ఈ సినిమాలో రెబల్ లుక్ లో కనిపించబోతుండడం విశేషం.

ఈ సినిమా 2025 మే 1న సినిమా రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సోమవారం టీజర్ రిలీజ్ చేశారు.

సస్పెన్స్ థ్రిల్లర్ జానర్​లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ కూడా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్​గా నటిస్తోంది.

మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్​పై ప్రశాంత్ టి నిర్మిస్తున్నారు

, , ,
You may also like
Latest Posts from