తెలుగు ప్రేక్షకుల్లో నానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేచురల్ స్టార్‌గా తనదైన శైలిలో సినిమాలు ఎంచుకుంటూ, వరుసగా హిట్స్ అందుకుంటూ వెళ్తున్న నాని, తన మార్కెట్‌ను దక్షిణాదినంతటా విస్తరించాడు. తాజాగా టాలీవుడ్‌కు మాత్రమే కాకుండా కోలీవుడ్ అభిమానులను కూడా అలరించే విధంగా ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే, కార్తి29 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న కార్తి కొత్త చిత్రంలో నాని ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఈ చిత్రం కార్తికి 29వ సినిమా. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్స్ ఫ్యాన్స్‌ను ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. మలయాళ స్టార్ నివిన్ పాలీ ఇందులో కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం. అలాగే, హీరోయిన్‌గా కల్యాణీ ప్రియదర్శన్ ఎంపికయ్యారు.

ఇక నాని గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వబోతున్నాడనే వార్తతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్‌గా సంతోష్ నారాయణన్ పనిచేసే అవకాశం ఉంది. సముద్ర తీర ప్రాంతాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందిస్తున్న ఈ చిత్రం పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కనుంది.

ఇక టాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందిన తమిళ నటుడు కార్తి, ఇటీవలి కాలంలో నానితో ‘హిట్-3’ క్లైమాక్స్‌లో కనిపించాడు. ఇప్పుడు నానీ అతని సినిమాలో కనిపించనున్నాడంటే.. ఇది రెసిప్రోకేషన్‌గా భావిస్తున్నారు సినీ వర్గాలు.

ప్రస్తుతం కార్తి నలన్ కుమరసామి డైరెక్షన్‌లో ‘Vaa Vaathiyar’ , అలాగే పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో ‘సర్దార్ 2’లో బిజీగా ఉన్నారు. ఆ తరువాత ‘తానక్కారన్’ ఫేమ్ తమిళ్ దర్శకత్వంలో రూపొందే కొత్త ప్రాజెక్ట్‌లో నాని స్పెషల్ గెస్ట్‌గా కనిపించనున్నారని బజ్.

ఇది నిజమైతే, రెండు ఇండస్ట్రీల అభిమానులకు ఇది ఓ విజువల్ ట్రీట్ కట్టుదిట్టంగా చెప్పవచ్చు!

, , ,
You may also like
Latest Posts from