మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. మైథలాజికల్ నేపధ్యంలో లో రూపొందుతున్న ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ డైరక్టర్. ఈ భారీ ప్రాజెక్టులో పలువురు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ స్టార్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ మూవీలో రెబెల్ స్టార్ ప్రభాస్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారనే విషయం తెలిసిందే. దీంతో సినిమాలో డార్లింగ్ లుక్ ఎలా ఉండబోతుందా అని ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ప్రభాస్ ‘రుద్ర’లుక్ రిలీజైంది.
‘కన్నప్ప’లో ప్రభాస్ రుద్ర లుక్ ఎలా ఉందంటే..ఒత్తైన, పొడవాటి జుత్తు, మెళ్లో రుద్రాక్ష మాలలు, నుదుటన విభూతి, నల్లని వస్త్రాలు, భుజాన కాషాయ కండువాతో ప్రభాస్ ఉన్నారు.
ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ జస్ట్ యావరేజ్ అని పెదవి విరుస్తున్నారు. కొంతమందైతే ఇదేమైనా ఏఐ సృష్టించిన విజువలా? అని డిస్కషన్ కూడా మొదలెట్టారు.
ఈ క్రమంలో ఈ లుక్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ధియేటర్లకు వెళ్తారా? అనేది కొత్త అనుమానం కలుగుతోంది.
‘కన్నప్ప’ నుంచి ఇప్పటి వరకూ చాలా లుక్స్ బయటకు వచ్చాయి. అవేమీ టాక్ ఆఫ్ ది టౌన్ కాలేకపోయాయి. ప్రభాస్ లుక్ కూడా అదే రూటులోకి వెళ్లిపోయింది.