
హాలీవుడ్ కూడా చేయని పని… ‘వారణాసి’తో రాజమౌళి మరో షాక్
మహేష్ బాబు – రాజమౌళి సినిమా అనగానే ప్రేక్షకుల్లో సహజంగానే ఓ ప్రత్యేకమైన అంచనా ఏర్పడుతుంది. ఆ అంచనాలన్నింటినీ మించి, ఇప్పుడే ‘వారణాసి’ క్రేజ్ దేశం దాటిపోయి ప్రపంచ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. సినిమా నుంచి ఒక ఫోటో, ఒక అప్డేట్ బయటికి వచ్చినా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించే స్థాయికి ఈ ప్రాజెక్ట్ చేరుకుంది. ఇంకా షూటింగ్ దశలోనే ఉండగానే ఇంతటి హైప్ తెచ్చుకోవడం ‘వారణాసి’ ప్రత్యేకత.
ఈ క్రేజ్‌కు ఇప్పుడు నెక్ట్స్ లెవిల్ కి చేరింది. ఓ హిస్టరీ క్రియేషన్ కు దారి తీసింది. ప్రపంచంలో ఏ సినిమా పరిశ్రమ ఇప్పటివరకు చేయని విధంగా, ‘వారణాసి’ ట్రైలర్‌ను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై 1.43 IMAX ఫార్మాట్‌లో రిలీజ్ చేసి గ్లోబల్ ఫస్ట్‌గా నిలిచింది. ఇప్పటివరకు ఈ ఫార్మాట్ అనేది కేవలం థియేటర్లకే పరిమితమై ఉండగా, ఇప్పుడు ఆ అనుభూతిని ఆన్‌లైన్‌కు తీసుకురావడం తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది.
ఈ వార్త బయటకు రాగానే అభిమానుల్లో ఉత్సాహం పీక్‌కి చేరింది. సోషల్ మీడియాలో ‘వారణాసి’ పేరు ట్రెండింగ్ అవుతూ, రాజమౌళి విజన్‌పై మరోసారి ప్రపంచ దృష్టి పడింది. ఒక ట్రైలర్‌తోనే ఇంతటి ఇంటర్నేషనల్ ఫోకస్ తెచ్చుకోవడం అంటే, ఈ సినిమా ఎంత పెద్ద స్థాయిలో రూపుదిద్దుకుంటుందో అర్థమవుతోంది.
ఇటీవలే ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌తో రాజమౌళి చేసిన ఆన్‌లైన్ సంభాషణ కూడా ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. ఆ ఇంటరాక్షన్ తర్వాత మహేష్ బాబు నటిస్తున్న గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్ ఎలా ఉండబోతోందన్న చర్చలు గట్టిగా మొదలయ్యాయి. ఇప్పుడు అదే చర్చలకు బలం చేకూర్చేలా ఈ IMAX ట్రైలర్ రికార్డ్ నిలిచింది.
మొత్తంగా చూస్తే, ‘వారణాసి’ సినిమా రిలీజ్‌కి ముందే ఇండియన్ సినిమాకే కాదు, గ్లోబల్ సినీ ఇండస్ట్రీకే కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తోంది. ట్రైలర్‌తోనే చరిత్ర సృష్టించిన ఈ ప్రాజెక్ట్, థియేటర్లలో ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
