ఎన్టీఆర్‌ (NTR), దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Prasanth Neel) కాంబినేషన్‌లో ఓ పాన్‌ ఇండియా చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. గతేడాది ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం జరిగినా షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. అయితే ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ మొదలైనట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టి చెప్పింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఫిల్మ్ సర్కిల్స్‌లో లేటెస్ట్ బజ్ ఏమిటంటే, ఈ ఎంటర్‌టైనర్ ఏప్రిల్ 9, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు ఇవాళా, రేపట్లో రిలీజ్ డేట్ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది. మొదట్లో ఈ సినిమాని 2026 సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు, కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ప్లాన్ మార్చారు.

ప్రస్తుతం ఈ సినిమా (NTR 31) కోసం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఓల్డ్‌ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను సిద్ధం చేసి, అక్కడే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ పీరియాడిక్‌ మాస్‌ యాక్షన్‌ డ్రామాలో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణీ వసంత్‌ కనిపించనుంది.

పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీ రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

మలయాళ యువ హీరో టొవినో థామస్‌ కీలక పాత్రలో సందడి చేయనున్నట్లు తెలిసింది. దీనికి రవి బస్రూర్‌ సంగీతం అందిస్తున్నారు.

,
You may also like
Latest Posts from