తెలుగులో అతి కొద్ది సినిమాలతోనే ప్రతిష్టాత్మక బ్యానర్ గా ఎదిగింది హారిక హాసిని సంస్ద.ఆ బ్యానర్ కు అనుబంధ సంస్థగా ఇండస్ట్రీలోకి వచ్చిన సితార ఎంటర్టైన్మెంట్స్ వరుస సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కువగా మీడియం రేంజ్ సినిమాలు చేస్తూ మంచి ప్రాఫిట్స్ అందుకుంటోంది. దీని వెనుక త్రివిక్రమ్ ఫార్చూన్ ఫోర్ ఎంటర్టైన్మెంట్స్ కూడా ఉండడంతో మంచి కథలను సెలెక్ట్ చేసుకుంటున్నారనే చెప్పాలి. ఈ సంస్థ అధినేత నాగవంశీ తమ 50వ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“మీ 50వ సినిమా కోసం పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరిలో ఒకరిని మాత్రమే ఎంచుకోవాల్సి వస్తే, ఎవరిని ఎంచుకుంటారు?” అనే ప్రశ్నకు నాగవంశీ అదిరిపోయే సమాధానం ఇచ్చారు..
నాగవంశీ మాట్లాడుతూ… ‘పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న స్థాయిలో తన రాష్ట్రానికి, దేశానికి ఏం చేస్తారు, ఇంకా ఎక్కడికి వెళతారు అనే దానిపై ఫోకస్ ఉంటుంది. అందుకే ఆయనతో సినిమా చేయాలనే ఆలోచన చేయను. ఆయన ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటాను..’ అని అన్నారు. అయితే ఇద్దరిలో, ఒకరు మాత్రమే అని అడిగితే, తారక్ నే ఎంచుకుంటాను అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇక ఈ బ్యానర్ మార్చి 28న విడుదల కానున్న మ్యాడ్ స్క్వేర్ తో మరోసారి ఫన్ ఎంటర్టైనర్‌ను తెరపైకి తీసుకురాబోతోంది.