
ఈ ఏడాది అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న తెలుగు సినిమా “ఓజీ”. ప్రీ-రిలీజ్ బిజినెస్, అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఈ సినిమా ఇప్పటికే రికార్డులు బద్దలు కొట్టింది. USA, కెనడాలో ఒక నెల క్రితమే బుకింగ్స్ ఓపెన్ చేసి, అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. భారీ ఓపెనింగ్ ఖాయమని ఫ్యాన్స్‌లో ఎక్సైట్మెంట్ పెరిగింది.
కానీ ఇప్పుడు “కంటెంట్ డిలే” తో ఊహించని షాక్! టైమ్‌కి కంటెంట్ అందకపోవడంతో అమెరికా, కెనడాలోని పలు మల్టీప్లెక్స్ చైన్‌లు షోలు రద్దు చేస్తున్నాయి. అక్కడి రూల్స్ ప్రకారం కంటెంట్ ముందుగానే రాకపోతే, షోను నేరుగా క్యాన్సిల్ చేస్తారు. దీంతో ఇప్పటికే అనేక ప్రీమియర్ షోలు రద్దయి, ఓజీ ఓపెనింగ్ నంబర్స్‌పై డైరెక్ట్ ఇంపాక్ట్ పడనుంది.
పోస్ట్ ప్రొడక్షన్‌కి చాలినంత సమయం ఉన్నప్పటికీ, ఎందుకు డిలే అయ్యిందో ఫ్యాన్స్ అర్థం కావటం లేదు. ట్రైలర్ కూడా ఆలస్యంగా, నిన్ననే విడుదల చేశారు. దీంతో డైరెక్టర్ సుజీత్, DVV ఎంటర్టైన్‌మెంట్‌పై సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్స్ పడుతున్నాయి.
అయితేనేం, సెప్టెంబర్ 24 రాత్రి స్పెషల్ ప్రీమియర్స్, సెప్టెంబర్ 25 గ్రాండ్ రిలీజ్ ఖాయంగా జరగనున్నాయి. కానీ ఈ డిలే కారణంగా కలెక్షన్స్‌పై ఎంతవరకు ప్రభావం పడుతుందో అన్నది ఇప్పుడు హాట్ టాపిక్!
