
పవన్ కళ్యాణ్ “ఓజీ” సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోందంటే అతిశయోక్తి కాదు. అయితే అందరిలోనూ ఓవర్సీస్ రన్ మాత్రం స్పెషల్‌గా నిలిచిపోయింది! మొదటి రోజే ఓవర్సీస్ రైట్స్ ఖర్చు తేల్చేసిన ఈ సినిమా, అక్కడి నుంచి పూర్తి లాభాల దిశగా దూసుకెళ్లింది.
తాజాగా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం —
కేవలం నార్త్ అమెరికా లో వసూళ్లు $5.6 మిలియన్
యూకే & ఐర్లాండ్ నుంచి $500K
మిడిల్ ఈస్ట్ నుంచి $456K
ఆస్ట్రేలియా & న్యూజిలాండ్ నుంచి $420K
యూరప్ & మిగిలిన ప్రపంచం నుంచి $350K
మొత్తం ఓవర్సీస్ గ్రాస్ $7.3 మిలియన్ (దాదాపు ₹65 కోట్ల రూపాయలు)!
ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓవర్సీస్ గ్రోసర్!
2025లో ఓవర్సీస్‌లో టాలీవుడ్ నంబర్ వన్ మూవీ కూడా ఇదే!
ప్రత్యేకంగా తెలుగులో విడుదలైన వర్షన్ ఓవర్సీస్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. పవన్ స్టార్డమ్‌కు, “ఓజీ” ఇంపాక్ట్‌కి ఇది సాక్ష్యం.
