2009లో పండోరా అనే పేరును మన మనసుల్లో చెక్కిన జేమ్స్ కామెరూన్, అప్పటి నుంచి ప్రతి భాగంతో విజువల్స్‌కు కొత్త నిర్వచనం చెప్పాడు. మొదటి భాగం మనకు “ఆసక్తిని” ఇచ్చింది… రెండో భాగం “ఆశ్చర్యాన్ని”… కానీ మూడో భాగం? ఇది “అగ్నిలా మండే భావోద్వేగం”.

అవతార్ 3 — ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ ఒక్కసారిగా వచ్చి, ఆడియన్స్ మదిలో మంటలు రేపింది. అభిమానులు ప్రతి ఫ్రేమ్‌ని ఫోన్ పక్కకు పెట్టేసి, కన్నుల్ని తెరిచి చూస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పుడున్న క్రేజ్, ఏ హాలీవుడ్ ఫ్రాంచైజీకి సాధ్యమైనంతగా లేదు. ఇది యే కేవలం కథ కాదు… ప్రతి ప్రేక్షకుడి ఊహకు ఛాలెంజ్

‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ పేరుతో విడుదలైన అవతార్ 3 ట్రైలర్ జూలై 25న థియేటర్లలో ‘ది ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్’ మూవీతో పాటు ప్రదర్శించగా, ఇప్పుడది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. పండోరా గ్రహంపై ఒక నూతన తత్వాన్ని, అగ్ని నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని ఈసారి ప్రేక్షకులను మరో మాయా లోకంలోకి తీసుకెళ్లనుంది జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్.

ట్రైలర్ చూస్తేనే శరీరంలో ఎర్రటి మంట మనపై ప్రవహించినట్టు ఉంటుంది. ‘ఫైర్ అండ్ యాష్’ అన్న పేరుకు తగ్గట్టుగానే ఈ సారి కథలో అగ్ని తెగ కీలక పాత్ర పోషించనుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందులో కొత్తగా పరిచయం చేసిన ‘వరంగ్’ అనే నావి పాత్ర చర్చనీయాంశమైంది. బ్రిటిష్ నటి ఊనా చాప్లిన్ ఈ పాత్రలో ఆకట్టుకునే విధంగా కనిపించారు. మానవులు vs నావి గర్జనలకు కొత్త కౌంటర్‌గా ఈ అగ్ని తెగ లైన్ మూడో భాగాన్ని మరింత ఉత్కంఠగా మలచనుంది.

2009లో మొదటి అవతార్‌తో వావ్ అనిపించిన కామెరూన్, 2022లో వచ్చిన ‘ది వే ఆఫ్ వాటర్’లో జలశక్తిని చూపించగా – ఇప్పుడు మూడో భాగంలో అగ్ని నేపథ్యంలో కూడిన కథతో ప్రేక్షకుల హృదయాల్లో మంటలేస్తున్నాడు. ఇందులో చూపించిన కొత్త జీవులు, భూముల నిర్మాణం, ఎఫెక్ట్స్ అన్నీ హాలీవుడ్‌ను మరోసారి తన కళాసృష్టి ముందు వంగిపోయేలా చేస్తున్నాయి.

ఈ సినిమా డిసెంబర్ 19న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే నాలుగో భాగం 2029లో, ఐదో భాగం 2031లో రాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించిన చిత్రబృందం, అవతార్ సిరీస్‌ను ప్రాజెక్ట్‌గా కాకుండా కాలాతీతంగా మలుచుతోంది.

ఇక పండోరా లొకేషన్ కాదు… భావావేశాల యుద్ధ భూమి.

,
You may also like
Latest Posts from