రెండు రోజులలో బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో పవన్ నిండు శాసనసభలో మాట్లాడుతూ ఖజానా పరిస్థితి ఇదీ పవన్ జల్సా చిత్రంలో డైలాగుని రిఫెరెన్స్ గా పెట్టుకుని చెప్పారు. పవన్ నటించిన జల్సా మూవీలో ఒక క్యాచీ డైలాగ్ ని ఆయన సభలో ఉటంకిస్తూ చొక్కా బొక్కా అంటూ మాట్లాడారు.
జల్సా సినిమాలో హీరో స్నేహితులు ఎవరొచ్చి అడినా వార్డు రోబ్ లో చొక్కా ఉంటుంది అందులో డబ్బులు ఉంటాయి తీస్కో అని చెబుతాడు. తీరా చూస్తే కనుక అసలైన చొక్కా యజమాని అందులో నుంచి వచ్చి చొక్కా వెనక ఏమీ లేదు బొక్క తప్ప అని ట్విస్ట్ ఇస్తాడు అని పవన్ చెప్పారు.
అలా దానిని రిఫరెన్స్ గా తీసుకుని ఆయన ఖజానా ఖాళీ అయింది అని ఫుల్ క్లారిటీ తో చెప్పేశారు అని అంటున్నారు. పవన్ స్వతహాగా సినీ నటుడు క్రియేటర్ కనుక సినీ పరిభాషలో ఏపీ ఆర్థిక పరిస్థితి ఇదీ అని కళ్ళకు కట్టినట్లుగా చెప్పేశారు అని అంటున్నారు.
దీని వల్ల అటు క్లాస్ మాస్ అందరికీ ఒక్కసారిగా ఏపీలో ఆర్థిక పరిస్థితులు అర్ధమవుతాయన్న ఉద్దేశ్యంతోనే పవన్ ఒక సక్సెస్ ఫుల్ సినిమాలోని డైలాగ్ ని రిఫరెన్స్ గా ఇచ్చారు అని అంటున్నారు.
జల్సా కంటే ముందు పవన్ కళ్యాణ్ వరస ప్లాపుల్లో ఉన్నాడు. ఏ సినిమా వచ్చినా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అలాంటి సమయంలో భారీ అంచనాల మధ్య విడుదలైంది జల్సా సినిమా. అప్పటి వరకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లో ఉన్న పాత రికార్డులన్నింటినీ తిరగరాస్తూ సినిమా దూసుకుపోయింది.