పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ “హరిహర వీరమలు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్” విడుదలకి సమీపిస్తుండగా, సినిమా బిజినెస్ ఇంకా పూర్తి కాలేదంటే నమ్మడం కష్టమే. కానీ ఇదే నిజం. ప్రాజెక్ట్‌కు లెక్కలేనన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. దీనికి కారణం ఎవరో కాదు.. నిర్మాత గారే అంటోంది ట్రేడ్!
ఇప్పటికే సినిమా భారీగా దాదాపు ముగింపు దశకు చేరగా, బిజినెస్ మాత్రం ఇంకా చర్చల దశలో ఉంది. నిర్మాత ఎవరు ఎక్కువ రేట్ చెబుతారో వారినే నమ్ముతున్నారు. అయితే వారు ఎప్పుడు, ఎలా చెల్లిస్తారో అన్న దానిపై మాత్రం ఆలోచనలేదు. బిజినెస్‌కి ఉన్న మైనస్ పాయింట్ అదే.
దిల్ రాజు 50 కోట్లు పెట్టాడు.. తిరస్కరించాడు నిర్మాత!
దిల్ రాజు “నిజాం”కి ₹35 కోట్లు, “ఉత్తరాంధ్ర”కి ₹12 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండగా… నిర్మాత మాత్రం మరొకరిని సీన్ లోకి తీసుకొచ్చారు. ఉత్తరాంధ్ర రైట్స్‌ను విజ్ఞేశ్వర ఫిలింస్ అనే డిస్ట్రిబ్యూటర్‌కి ₹14 కోట్లకు అప్పగించారని సమాచారం. కానీ… ఆ మొత్తాన్ని రిలీజ్‌కి ముందే పూర్తి ఇస్తారా అన్నదే ఇప్పుడు ట్రేడ్ లో చర్చగా మారిన ప్రశ్న!
నైజాంలో మాత్రం నిర్మాత సొంతగా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కానీ ఇప్పటివరకు ఒక్క అడ్వాన్స్ కూడా రాలేదు. చర్చలు ఇంకా నడుస్తున్నాయ్ అంటేనే సినిమా బిజినెస్ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
లీడింగ్ డిస్ట్రిబ్యూటర్లను నమ్మని నిర్మాత.. చివరికి చిక్కుల్లో!
సినిమాను ఒక రిప్యూటెడ్ డిస్ట్రిబ్యూటర్‌కు సరైన రేటుకి అప్పగించి ఉంటే… ఈ రోజు ఈ పరిస్థితి తలెత్తేది కాదు. ఫైనాన్షియల్‌గా ఇప్పుడు మూవీ స్టేట్ మెంట్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నట్టే.
పవన్ కళ్యాణ్ సినిమాకు ఈ స్థాయి గందరగోళం అవసరమా? రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా బిజినెస్ పూర్తి కాలేదంటే… బిజినెస్ వైజ్ హరిహర వీరమల్లు ఓ పెద్ద పరీక్షే ఎదుర్కొంటోంది!
ఇంకా పక్కా డీల్స్ లేవు, రిలీజ్ దగ్గర పడుతుండగా నిర్మాత గందరగోళంలో.. చివరికి హరిహర వీరమల్లునే స్మూత్ రిలీజ్ అవుతుందా?