ఒక టైమ్ లో టాలీవుడ్ టాప్ హీరోలందరితో సినిమాలు చేసిన పూజా హెగ్డే, భారీ పారితోషికం తీసుకునే హీరోయిన్గా పేరు సంపాదించుకుంది. అలాగని వరుసగా ప్లాప్‌లు వచ్చేసరికి, ఆమె క్రేజ్ కొంత తగ్గిపోయింది. తెలుగు అవకాశాలు తగ్గడంతో, తమిళం-హిందీ సినిమాలవైపు మళ్లింది. అయితే మళ్లీ తెలుగులోకి గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇవ్వాలని ఆమె చాలా కాలంగా ప్రయత్నిస్తోంది.
ఇప్పుడు ఆ అవకాశం ఆమెకు వచ్చినట్టే ఉంది! పూజా హెగ్డే, దుల్కర్ సల్మాన్ హీరోగా నటించే తాజా తెలుగు సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది. ఇది దుల్కర్ కి స్ట్రైట్ తెలుగు సినిమా అవుతుంది. ఈ సినిమాకు కొత్త డైరక్టర్ రవి దర్శకత్వం వహించబోతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ లాక్ అయిపోయింది, కానీ దుల్కర్ ఇతర కమిట్మెంట్స్ వల్ల షూటింగ్ ఆలస్యం అయింది.
ఇటీవలే పూజాను సంప్రదించగా, ఆమె ఈ కథ నచ్చి ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్‌ను సుధాకర్ చెరుకూరి SLV Cinemas బ్యానర్‌పై నిర్మించనున్నారు.
ప్రస్తుతం దుల్కర్ ‘కాంతా’, ‘ఆకాశంలో ఒక తార’ అనే రెండు తెలుగు చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.
తిరిగి ఫామ్ లోకి రావాలనుకుంటున్న పూజా హెగ్డేకు, ఈ సినిమా ఓ కీలకమైన టర్నింగ్ పాయింట్ అవుతుందేమో చూడాలి!