ఆ మధ్యన వరస ఫ్లాఫ్ లు రావటంతో పూజా హెగ్డే పూర్తిగా ఖాళీ పడింది. అయితే మళ్లీ టేబుర్స్ ఆమె వైపుకు టర్న్ అవుతున్నాయి. తాజాగా ఆమెకు ఓ అదిరిపోయే ఛాన్స్ వ‌చ్చింద‌ని తెలుస్తోంది. అదీ సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్ సినిమాలో తాను ఓ స్పెషల్ సాంగ్ . ఆ పాప మామూలుగా ఉండదట. రీసెంట్ గా జైలర్ లో తమన్నా దుమ్ము రేపింది. ఇప్పుడు పూజ అదరకొట్టబోతోందన్నమాట. ఇంతకీ ఆ సినిమా ఏమిటి అంటే కూలి.

ర‌జ‌నీకాంత్ – లోకేష్ క‌న‌గ‌రాజ్ కాంబోలో ‘కూలీ’ అనే ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాగార్జున ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఆ పాట‌లో పూజా హెగ్డే క‌నిపించనుందని వార్త.

ఇటీవ‌ల పూజాతో.. చిత్ర‌ టీమ్ సంప్ర‌దింపులు జ‌రిపింద‌ని, పూజా కూడా ఈ పాట‌లో డాన్స్ చేయటానికి కమిటైందని స‌మాచారం అందుతోంది. అన్ని విధాలుగా చూసినా పూజాకు ఇది మంచి అవ‌కాశం.

పూజా హెగ్డేకి ఐటెమ్ సాంగ్స్ చేయ‌డం కొత్తేం కాదు. ‘రంగ‌స్థ‌లం’, ‘ఎఫ్ 3’లాంటి చిత్రాల్లో ఐటెమ్ భామ‌గా మెరిసింది. అయితే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో క‌ల‌సి న‌టించ‌డం ఇదే తొలిసారి. కాబ‌ట్టి… త‌నకు ఇది మంచి అవ‌కాశ‌మే. పైగా ఇది లోకేష్ క‌న‌గ‌రాజ్ సినిమా.

ఈ సినిమాలో ఉపేంద్ర‌, శ్రుతిహాస‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. ఆగ‌స్టులో ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు.

ఇక పూజ ‘కాంచ‌న 4’లో లారెన్స్‌తో క‌ల‌సి న‌టిస్తోంది . ఇది కాకుండా ఓ హిందీ సినిమా ఉంది. సూర్య ‘రెట్రో’లోనూ త‌నే హీరోయిన్.

, , ,
You may also like
Latest Posts from