పాన్ ఇండియా హీరో ప్రభాస్ (Prabhas) .. దర్శకుడు ప్రశాంత్ నీల్ కలిసి చేసిన చిత్రం ‘సలార్’.మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటించడం ఈ చిత్రానికి మరో ఆకర్షణ. భారీ సందడి మధ్య విడుదలైన ఈ చిత్రం మార్నింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ కటౌట్‌కు తగిన హిట్ పడిందని ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. ఇప్పుడు యేడాది అయ్యాక అదే ఫ్యాన్స్ మరోసారి ఆనందపడటానికి ఓ రీజన్ దొరికింది.
ఈ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది గడిచినప్పటికీ ఇంకా ఇప్పటికీ జియో హాట్ స్టార్ లో టాప్ 10 సినిమాల్లో ఒకటిగా ట్రెండ్ అవుతోంది. దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సలార్ సినిమాలోని కొన్ని సీన్స్ ని షేర్ చేస్తూ ట్రెండింగ్ చేస్తున్నారు.
తాజాగా దీనిపై నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ స్పందించారు. దీన్ని అసలు ఊహించలేదన్నారు. ‘‘365 రోజుల నుంచి ఇప్పటికీ ట్రెండింగ్. అద్భుతమైన థియేటర్ రన్ తర్వాత మా చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా చరిత్ర సృష్టిస్తోంది. దీన్ని నేనెప్పుడూ ఊహించలేదు. ఇది కేవలం రికార్డు కాదు.. మా ప్రేక్షకుల ప్రేమ, వారి అభిమానానికి నిదర్శనం. ఈ ప్రయాణం నిజంగా మరపురానిదిగా చేసినందుకు అందరికీ ధన్యావాదాలు’’ అని అన్నారు (Salaar OTT record).
ప్రభాస్… ప్రశాంత్ నీల్ కలయిక నుంచి ప్రేక్షకులు, అభిమానులు ఏం ఆశిస్తారో ఆ హంగులన్నీ ఈ సినిమాలో ఉన్నాయి.
కె.జి.యఫ్ సినిమాలతో పోలిస్తే హీరోయిజం, ఎలివేషన్ల కంటే ఇందులో డ్రామాకి ఎక్కువ ప్రాధాన్యమిస్తూ కథని నడిపించాడు. అలాగని హీరోయిజానికీ తక్కువేమీ చేయలేదు. అవసరమైనప్పుడంతా మంచి ఎలివేషన్లతో ప్రభాస్‌ని చాలా రోజుల తర్వాత అభిమానులకి నచ్చేలా చూపించారు.
స్నేహం, అధికార కాంక్ష, ప్రతీకారం చుట్టూ తిరిగిన సినిమా ఆకట్టుకుంటుంది.