సినిమా వార్తలు

జపాన్ లో ప్రభాస్ మేనియా! అందుకే డార్లింగ్ ఈ డెసిషన్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ జపాన్‌లో కల్చర్ లెవెల్ పాపులారిటీ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. “బాహుబలి” అక్కడ రిలీజ్ అయిన దగ్గరినుంచే ప్రభాస్‌కి అక్కడ క్రేజ్ కి ఆకాశమే హద్దులైంది. హీరోని ఒక్కసారి చూసేందుకు హైదరాబాదుకే వచ్చే జపనీస్ ఫ్యాన్స్ ఉన్నారు… అంత లవ్, అంత డెడికేషన్!

ఆ సమయంలో “ఒకరోజు మీ అందరినీ పర్సనల్‌గా కలుస్తా” అని ప్రభాస్ ఫ్యాన్స్‌కి ప్రామిస్ ఇచ్చాడు. గత సంవత్సరం “సలార్” జపాన్ రిలీజ్ సందర్భంలో కూడా ఆన్‌లైన్ ఇంటరాక్షన్‌లో “తర్వాత ఖచ్చితంగా జపాన్‌కి వస్తా” అని మరోసారి హామీ ఇచ్చాడు.

ఇప్పుడు తాజా బజ్ ఏమంటోంటే — ప్రభాస్ వచ్చే నెలలోనే జపాన్ ట్రిప్‌కు వెళ్తున్నాడట!
“ఫౌజీ” షూట్ నుంచి చిన్న బ్రేక్ తీసుకుని జపనీస్ అభిమానులను పర్సనల్‌గా కలవాలని ప్లాన్ చేస్తున్నాడని టాక్.

అంతేకాదు… జపాన్ వెళ్లే ముందు ప్రభాస్ కొద్దిరోజులు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న “స్పిరిట్” షూట్‌లో కూడా పాల్గొనే అవకాశముందట.

Similar Posts