ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమాపై అంచనాలు ఊహించలేనంత పెరిగిపోయాయి. టీజర్‌, ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యాక, సినిమా చుట్టూ హైప్ ఆకాశాన్నంటుతోంది. జనవరి 9, 2026న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా వార్త ఫ్యాన్స్‌ను షాక్‌కు గురి చేస్తోంది — తెలుగు వెర్షన్‌ బ్రేక్ ఈవెన్ విలువ 200 కోట్లకు పైగా ఉందట!

ప్రస్తుతం టీమ్‌ విదేశాల్లో పాటల షూట్‌లో బిజీగా ఉంది. అంతేకాదు, ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలనే ప్లాన్ కూడా సిద్ధంగా ఉంది.

ఇక బిజినెస్ విషయంలో చూస్తే, చర్చలు ఫైనల్ స్టేజ్‌కి చేరుకున్నాయి. కొన్ని ఏరియాలు ఇప్పటికే క్లోజ్ కూడా అయ్యాయి. సమాచారం ప్రకారం
ఆంధ్ర 6 ఏరియాలకు రేటు సుమారు 75 నుంచి 80 కోట్ల వరకు,

సీడెడ్‌ రైట్స్‌ 25 కోట్లకు పైగా,
నైజాం ఏరియా మాత్రం 60 కోట్లకు పైగా ఉంటుందట.

మొత్తం కలిపితే, తెలుగు స్టేట్స్‌ బిజినెస్‌ 160-165 కోట్లకు చేరుకునే అవకాశం ఉంది. అంతేకాదు, ఓవర్సీస్ రైట్స్‌ కూడా రికార్డ్ స్థాయిలో అమ్ముడవుతున్నాయి. ఇలా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ‘ది రాజా సాబ్’ తెలుగు వెర్షన్‌ బిజినెస్‌ 225 కోట్ల వరకు చేరే అవకాశముంది!

అంతా ఫైనల్ కాకపోయినా, ఒక్క విషయం స్పష్టంగా కనిపిస్తోంది — 200 కోట్ల మార్క్‌ దాటడం ఖాయం. ఇది ప్రభాస్‌ క్రేజ్‌ ఎంత స్థాయిలో ఉందో చెబుతోంది.

ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే, ఇతర టాప్‌ హీరోల భారీ కాంబినేషన్లు ఉన్నా కూడా 200 కోట్ల మార్క్‌ టచ్‌ చేయలేని పరిస్థితి ఉండగా, ప్రభాస్ మాత్రం మారుతితో కలిసి ఈ రేంజ్‌ బిజినెస్‌ సాధించడం నిజంగా అద్భుతం.

‘ది రాజా సాబ్’ బజ్‌ + ప్రభాస్‌ స్టార్ పవర్‌ + మారుతి మార్క్‌ ప్రమోషన్స్‌ = బ్లాక్‌బస్టర్ బిజినెస్ రికార్డ్!

ఈ బిజినెస్ హైప్‌ను థియేటర్లలో ప్రభాస్ మాజిక్‌గా మార్చగలడా?

, , , ,
You may also like
Latest Posts from