“లవ్ టుడే”, “డ్రాగన్” సినిమాలతో స్టార్‌గా అయ్యిన ప్రదీప్ రంగనాథన్‌ ప్రస్తుతం తన కొత్త చిత్రం డ్యూడ్ (Dude) ‌తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రదీప్ ప్రధాన పాత్రలో నటించగా, దర్శకత్వం చేపట్టింది కీర్తిశ్వరన్. మమిత బైజు హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం షూటింగ్‌ను తక్కువ సమయంలోనే పూర్తి చేశారు.

డ్యూడ్ సినిమా అక్టోబర్ 2025లో విడుదలకు సిద్ధమవుతోంది. మీడియం బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇప్పటికే డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ రూ. 25 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఇదే సినిమా బడ్జెట్‌కు సమానంగా ఉంది. అంటే థియేట్రికల్ హక్కులతో పాటు ఇతర నాన్-థియేట్రికల్ డీల్స్ ద్వారా నిర్మాతలకు భారీ లాభాలు లభించే అవకాశం ఉంది.

ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాకి స్క్రిప్ట్‌పై చాలా శ్రమ పెట్టినట్టు సమాచారం. ఇకపై ఆయన నటించిన మరో చిత్రం లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ, విజ్ఞేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కింది, సెప్టెంబర్‌లో విడుదల కానుంది.

, , , ,
You may also like
Latest Posts from