ఒక్కొక్క నటుడికీ ఒక్కో పాత్ర తమ జీవిత కాలంలో చేయాలని ఉంటుంది. అలా ప్రియదర్శికు శాంతా బయోటెక్ ఫౌండర్ కే ఐ వరప్రసాద్ గారి బయోపిక్ చేయాలని ఎప్పటినుంచో ఉందిట. ఈ విషయం స్వయంగా ప్రియదర్శి ప్రస్దావించాడు.
తన డ్రీం రోల్ గురించి అడగ్గా ప్రియదర్శి మాట్లాడుతూ.. నాకు బయోపిక్ చేయాలని వుంది. శాంతా బయోటెక్ ఫౌండర్ కే ఐ వరప్రసాద్ గారి బయోపిక్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది. దాని కోసం ప్రయత్నాలు కూడా చేశాను. ఓ సారి బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్దార్థ్ పెళ్ళిలో కూడా అయన కనిపిస్తే నేనే అడిగాను.
ఆయన సింపుల్ గా నవ్వేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత వేరే వాళ్ళతో కూడా ఆయన బయోపిక్ గురించి అడిగించాను. నా బయోపిక్ ఎందుకమ్మా అన్నారు. శాంత బయోటెక్ తో ఫార్మా రంగంలో తక్కువ ధరలకే మందులు తీసుకొచ్చి దేశానికి ఎంతో సేవ చేసారు. ఆయన ఒప్పుకుంటే ఆయన బయోపిక్ చేస్తాను అని తెలిపారు.
పెళ్లి చూపులు సినిమాతో కమెడియన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలతో మెప్పించారు ప్రియదర్శి.
బలగం సినిమాతో హీరోగా మారి మంచి హిట్ కొట్టాడు. ఆ తర్వాత వరుసగా హీరోగా కూడా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.
ప్రియదర్శి మెయిన్ లీడ్ లో తెరకెక్కుతున్న ‘కోర్ట్ – స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ సినిమా మార్చ్ 14న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాని నాని నిర్మాణ సంస్థలో రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.