హిట్ సినిమా ఫ్రాంచైజీ అంటే హీరోలందరికీ ఇష్టమే. కానీ ప్రియదర్శి మాత్రం తన కెరీర్‌ టర్నింగ్ పాయింట్‌గా నిలిచిన ‘జాతిరత్నాలు’కి సీక్వెల్‌ చెయ్యాలన్న ఆఫర్‌కే నో చెప్పేశాడు!

“జాతిరత్నాలు అనేది ఒక మ్యాజిక్‌. అలాంటి మ్యాజిక్‌ మళ్లీ రిపీట్‌ చేయాలనుకోవడం తప్పు. దాన్ని అలాగే వదిలేయాలి. ఇప్పటికీ ఏ కామెడీ సినిమా వచ్చినా దానితో పోల్చేస్తున్నారు అంటే అది ఒక ‘కల్ట్ క్లాసిక్‌’. దాన్ని మళ్లీ చేసి చెడగొట్టకూడదు. దానికంటే బెటర్‌ అవుట్‌పుట్‌ ఇచ్చే కథలు చేయాలి” అని చెప్పుకొచ్చాడు ప్రియదర్శి.

ఇక అతని కొత్త సినిమా ‘మిత్రమండలి’ ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ట్రైలర్‌ చూస్తే జాతిరత్నాల వైబ్‌ కనిపిస్తోంది. కానీ ప్రియదర్శి మాత్రం “రెండు కథలూ వేరు… కామెడీ ట్రీట్మెంట్‌ వేరు. కానీ ఈసారి మిత్రమండలి కూడా అంతే భారీ హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది” అని చెప్పాడు.

సీక్వెల్‌ వదిలి కొత్త మ్యాజిక్‌కి సిద్ధమవుతున్న ప్రియదర్శి — ఈసారి నిజంగా జాతిరత్నాల స్థాయిలో హిట్టిస్తాడా?

, , ,
You may also like
Latest Posts from