నటి, నిర్మాత ప్రియాంక చోప్రా జోనాస్ ముంబైలోని పశ్చిమ సబర్బ్ అంధేరీ వెస్ట్‌లోని లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని నాలుగు రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్లను అమ్మేసారు. ఈ డీల్స్ సోమవారం పూర్తైంది. 84.47 లక్షల విలువైన స్టాంప్ డ్యూటీ కట్టారు. నటుడి తరపున ప్రియాంక తల్లి మధు చోప్రా రెండు ఎగ్రిమెంట్స్ మీద సైన్ చేసారు. మొత్తం రూ. 16.17 కోట్లకు విక్రయించారు.
అలాగే నవంబర్ 2023లో, ప్రియాంక అదే ప్రాంతంలోని తన రెండు అపార్ట్‌మెంట్లను దర్శకుడు, నిర్మాత మరియు స్క్రీన్ రైటర్ అభిషేక్ చౌబేకి మొత్తం రూ.6 కోట్లకు విక్రయించింది.
ఏప్రిల్ 2023లో కూడా, ఆమె లోఖండ్‌వాలా ప్రాంతంలోని ఒక కమర్షియల్ ప్రాపర్టీని 2021లో తన దగ్గర నుండి అద్దెకు తీసుకున్న డెంటిస్ట్ దంపతులకు రూ. 7 కోట్లకు విక్రయించింది.
నిక్ జోనాస్‌తో వివాహం తర్వాత చోప్రా జోనాస్ 2018లో లాస్ ఏంజెల్స్‌కు వెళ్లారు మరియు ప్రస్తుతం అక్కడ అతనితో మరియు వారి కుమార్తె మాల్టీ మేరీ చోప్రా జోనాస్‌తో నివసిస్తున్నారు.
మహేశ్ బాబు, రాజమౌళి సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా జోనస్ హీరోయిన్ గా నటించనుందని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
మేకర్స్ ఈ విషయాన్ని అఫిషియల్ గా అనౌన్స్ చేయకపోయినా, ఇటీవల ప్రియాంక హైదరాబాద్ కు రావడంతో అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఆ తర్వాత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణితో ఆమె దిగిన ఫోటో బయటకు రాగానే హీరోయిన్ లాక్ అయిపోయిందనే నిర్ణయానికి వచ్చేసారు.
అయితే ఇంతలోనే ప్రియాంక ఈ సినిమాలో హీరోయిన్ కాదని, విలన్ అనే ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.