సెలబ్రిటీలు మెచ్చినపుడు… కళాకారుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. వారు చూసారంటే చాలు, తమను గుర్తించారంటే చాలు… నిమిషాల్లో విస్తరించే ఉత్సాహం అది!

ఇప్పుడు అదే జరిగింది ఇండియన్ డాన్స్ క్రూ B Uniqueకు.
అమెరికా రియాలిటీ షో America’s Got Talent వేదికపై వాళ్లు పుష్ప థీమ్‌ పాటకి అదరగొట్టే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
“పుష్ప పుష్ప” అంటూ థియేటర్లు కదిలించిన ఆ సాంగ్‌కు, ఇప్పుడు అమెరికా స్టేజీ కదిలింది!

అల్లు అర్జున్‌ నటించిన పుష్ప సినిమా నుండి ప్రేరణ తీసుకుని చేసిన ఈ హై ఎనర్జీ డాన్స్‌కి…
జడ్జిల నుంచి స్టాండింగ్ ఓవేషన్ మాత్రమే కాదు, గోల్డెన్ బజర్ కూడా దక్కింది!

ఇంతటి ప్రతిభకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫిదా అయిపోయారు.
సోషల్ మీడియాలో వారి వీడియోను షేర్ చేస్తూ…
“వావ్. మైండ్-బ్లోయింగ్!” అంటూ మెచ్చుకున్నారు.

స్ట్రీట్స్ నుంచి స్టేజ్ వరకూ, ఇండియాలోంచి అమెరికా వరకూ…
పుష్ప ఫీవర్ ఇంకా తగ్గలేదని మరోసారి రుజువైంది.
ఇలాంటి ప్రదర్శనలకు అల్లుఅర్జున్‌లాంటి స్టార్ నుంచి వచ్చిన ప్రశంసలు…
ఇంకెన్నో కలలు కంటున్న కళాకారులకు కొత్త జోష్ ఇస్తాయనడంలో సందేహం లేదు!

, , , ,
You may also like
Latest Posts from