ఏఆర్ రెహమాన్ సంగీతం అంటేనె ఒక మాయ, ఒక మానసిక యాత్ర. అలాంటి సంగీతాన్ని ప్రత్యక్షంగా లైవ్‌లో వినాలనేది ప్రతి సంగీతాభిమాని కలే! అలాంటి అపూర్వ అవకాశమే నవంబర్ 8న హైదరాబాద్‌లో రానుంది. కానీ ఈసారి ఆ కల కొంచెం ఖరీదైనదిగా మారింది.

రెహమాన్ గతంలో 2017లో గచ్చిబౌలిలో లైవ్ షో ఇచ్చారు. అక్కడ యూత్ నుంచి ఫ్యామిలీస్ వరకూ అన్ని వర్గాలూ వచ్చి ఆ మ్యూజిక్ ఫీస్ట్‌ను ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత ఇది ఆయనకు హైదరాబాద్‌లోనే మరోసారి లైవ్ షో. కానీ ఈసారి వేదిక రామోజీ ఫిలింసిటీ.

వేదిక అదుర్స్… కానీ ధరలు?

రామోజీ ఫిలింసిటీ అంటే మనకు తెలిసినవిషయం – అద్భుతమైన స్థలం కానీ సాధారణ రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల, అందరికీ తేలికగా వెళ్లగలిగే స్థలం కాదు. ఇదే తరుణంలో టికెట్ ధరలూ కూడా రెహమాన్ స్థాయిలోనే ఉన్నాయి – బేస్ టికెట్ ధర ఏకంగా ₹2000 (జీఎస్టీతో కలిపి)!

ఇప్పటి వరకు చెన్నై లైవ్ షోల్లో కనీసం ₹500 లేదా ₹900లో టికెట్లు దొరికేవి. 2017 హైదరాబాద్ షోలో కూడా ₹900 టికెట్ ఉండేది. ఈసారి అయితే డైరెక్ట్‌గా ₹2000 నుంచే ప్రారంభం. ఒక గంటలో ‘సోల్డ్ అవుట్’ అయ్యే సబ్సిడీ టికెట్లు లేవు.

అభిమానుల్లో మిక్స్‌డ్ రియాక్షన్స్

రెహమాన్ లైవ్ అనగానే వెళ్లాలి అనుకునే యూత్, స్టూడెంట్స్, మిడిల్ క్లాస్ మ్యూజిక్ లవర్స్ — వీరికి ఈ టికెట్ ధరలు షాక్ ఇచ్చేలా ఉన్నాయి. “మన బడ్జెట్‌లో ఈ లెవెల్ లైవ్ షోని ఎలా ఎంజాయ్ చేయాలి?” అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

, ,
You may also like
Latest Posts from