రజనీకాంత్ (Rajinikanth) హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కూలీ’.ఈ సినిమాలో నాగార్జున (Nagarjuna) కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్‌కు ఇది 171వ చిత్రం. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంతో సాగే యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.
ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్, సత్యరాజ్ సైతం ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. కూలీ నెంబర్ 1421గా రజనీకాంత్ దేవా రోల్ ప్లే చేస్తుండగా.. సైమన్‌గా నాగార్జున కనిపించనున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి తెలుగులోనూ ఓ రేంజి క్రేజ్ ఏర్పడింది. దాంతో రైట్స్ ని పోటీపడి మరీ తెలుగులో పెద్ద ప్రొడక్షన్ హౌస్ సితార ఎంటర్టైన్మెంట్ వారు సొంతం చేసుకున్నారు.
ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు భారీ మొత్తానికే తెలుగు డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకుంది సితార ఎంటర్టైన్మెంట్స్. గతంలో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో చిత్రాన్ని సైతం సితార వారే డిస్ట్రిబ్యూట్ చేసారు.
అప్పుడు లియో చిత్రానికి 9 కోట్లు దాకా తెలుగు రైట్స్ కు లాభం వచ్చింది. దాంతో రజనీకాంత్, ఉపేంద్ర, నాగార్జున, శృతిహాసన్ నటించే ఈ చిత్రానికి ఇంకెంత లాభాలు రాబోతున్నాయో అని లెక్కలు వేస్తోంది ట్రేడ్.
అలాగే తన ఐడిల్, తన స్పూర్తిప్రధాత.. తన ఆరాధ్యుడు రజినీ సర్‌తో కలిసి స్క్రీన్‌ను పంచుకోవడం ఆనందంగా ఉందంటూ ఉపేంద్ర ఇచ్చిన అప్డేట్ వైరల్ అవుతోంది. రజినీ, ఉపేంద్ర కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక ఉపేంద్ర రాకతో కూలీ మీద మరింతగా బజ్ ఏర్పడటం ఖాయం. కన్నడలోనూ ఈ మూవీకి మంచి డిమాండ్ ఏర్పడినట్టు అయింది