థియేటర్ల ముందు పండగలా సాగిన “కూలీ” ప్రీమియర్స్, బుకింగ్స్‌కి ఆరంభంలో ఎక్కడా తగ్గని క్రేజ్.. కానీ సినిమా రిలీజైన తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్ బలహీనంగా ఉండటంతో కలెక్షన్లలో డ్రాప్. అయితే తమిళనాడులో మరీ తక్కువు కలెక్షన్స్..అదే ఇప్పుడే పెద్ద చర్చనీయాంశమైంది. రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ సినిమా అయినా, తమిళనాడులో కలెక్షన్స్ లేకపోవడం పరిశ్రమలో కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది.

75 ఏళ్ల వయసులో కూడా రజినీకి తమిళం, తెలుగు, హిందీ బాక్సాఫీస్‌లపై క్రేజ్ అమాంతం ఉంది. కానీ ఆయన సినిమాలు స్వస్థలమైన తమిళనాడులో మాత్రం బాగా వెనకబడుతున్నాయి. “కబాలి”కి అన్ని ప్రాంతాల్లో భారీ బజ్ ఉన్నా, తమిళనాడులో మాత్రం అద్భుతమైన రిపీట్ వాల్యూ రాలేదు. “పేట” వర్సెస్ “విశ్వాసం” క్లాష్‌లో కూడా రజినీ మూవీ ఇతర ప్రాంతాల్లో ఆధిపత్యం చూపినా, తమిళనాడులో మాత్రం అజిత్ మూవీ క్లియర్ లీడ్ తీసుకుంది.

ఇక తాజాగా “జైలర్” కోలీవుడ్ బాక్సాఫీస్‌ను ఊపేసినప్పటికీ, తమిళనాడులో మాత్రం “పొన్నియన్ సెల్వన్ 1” రికార్డును దాటలేకపోయింది. ఇప్పుడు అదే పరిస్థితి “కూలీ”కి. అంచనాల ప్రకారం కనీసం 170 కోట్లు రావాలి అనుకున్నా, 150 కోట్లు కూడా కష్టంగానే కనిపిస్తోంది. ఇప్పటివరకు 11 రోజుల్లో 132 కోట్లు మాత్రమే సాధించగలిగింది.

👉 అసలు సమస్య ఎక్కడ?
– రిలీజ్‌కు ముందు ఉన్న అతి పెద్ద క్రేజ్
– రిలీజ్ తర్వాత వచ్చిన వీక్ టాక్
– ఇతర ప్రాంతాలతో పోలిస్తే తమిళనాడులో క్రమంగా పడిపోతున్న మార్కెట్

ఇలా గత కొన్ని ఏళ్లుగా రజినీ సినిమాలు తన మెయిన్ మార్కెట్ అయిన తమిళనాడులో 10–15% తక్కువగానే కలెక్ట్ చేస్తున్నాయి.

“సూపర్ స్టార్”కి స్వంత రాష్ట్రంలో ఈ గ్యాప్ ఎందుకు వస్తోంది? ఇక “కూలీ” ఫైనల్ రన్ ఎలా ఉంటుందో?” అన్నది ఇప్పుడు ట్రేడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్.

, , , , , , , ,
You may also like
Latest Posts from