తమిళ సినిమా చరిత్రలో తిరుగులేని రెండు శిఖరాలు – రజనీకాంత్… కమల్ హాసన్. వీరిద్దరూ ఒకే స్క్రీన్‌పై కనిపించడం అంటే థియేటర్స్ లో కాగితాలు గాల్లో ఎగరటం కాదు..ఏకంగా ఫ్యాన్స్ ఆనందంతో గాల్లో ఎగిరిపోవడమే! కానీ ఆ దృశ్యం చివరిసారిగా 1985లో ‘గిరఫ్తార్’ సినిమాలో చూసాం. అప్పటి నుంచి దాదాపు 40 ఏళ్లుగా ఈ కలపై అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. మణిరత్నం లాంటి దిగ్గజం సైతం ప్రయత్నించి సక్సెస్ కాలేకపోయాడు.

ఇప్పుడు ఆ కలను తెరపైకి తీసుకురావడానికి రెడీగా ఉన్నాడు ఒక కొత్త తరం క్రేజీ బ్రెయిన్ – లోకేష్ కనగరాజ్.

లోకేష్ డ్రీమ్ ప్లాన్ ఏంటంటే…

తాను ఎంతో కాలంగా డ్రీమ్ ప్రాజెక్ట్‌గానే దాచుకున్న స్క్రిప్ట్ ఒకటి ఉంది. అది కూడా ఊహించని కాన్సెప్ట్ – వయసు మీదపడ్డ ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్ కథ!

వారు రిటైర్‌ అయ్యాక జీవితంలో ఏం చేశారో తెలియజేసే ఈ కథలో, యాక్షన్, ఎమోషన్, సిస్టం,సానుభూతి అన్నీ ఉన్నాయి. లోకేష్ చెబుతున్నట్టు, “ఈ స్క్రిప్ట్ ఇప్పటికీ నా దగ్గర ఉంది. చేయడానికి నేను రెడీనే. కానీ ఇప్పుడు రజనీ సార్, కమల్ సార్ మార్కెట్ విలువలు చాలా పెద్దవి. అందుకే ప్రాజెక్ట్‌కి కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి.”

అభిమానులు అంటున్నారు – “ఇదే టైమ్, ఇదే టీం!”

ఇప్పటి తరం దర్శకుల్లో, ఈ ఇద్దరు లెజెండ్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ స్క్రీన్‌పై క్రేజీ మాజిక్ క్రియేట్ చేయగల స్కిల్ ఒకడికే ఉంది – అది లోకేష్ కనగరాజ్ కే!

కమల్‌హాసన్‌తో విక్రం,

రజనీకాంత్‌తో ఇప్పుడు కూలీ,

విజయ్‌తో లియో,

ఇలాంటి బిగ్ స్టార్స్‌తో అనుభవం కలిగిన డైరెక్టర్, వీరిద్దరినీ మేనేజ్ చేయడంలో, క్యారెక్టర్ ని మేనేజ్ చేయటంలో మాస్టర్ అని ఇండస్ట్రీ అంతా నమ్ముతోంది.

ఇప్పుడేదైనా సాధ్యమే…

కమల్–రజనీ ఇద్దరూ ఇప్పుడు తమ కెరీర్‌లో మళ్లీ పీక్ స్టేజ్‌లోకి వచ్చారు. కమల్‌కి విక్రమ్ తో బ్రేక్, రజనీకి జైలర్ తో బ్లాక్ బస్టర్. ఈ టైమ్‌లో వీరిద్దరినీ ఒకే తెరపై చూడాలనుకోవడం అభిమానులకు చిన్న ఆశ కాదు. అది ఒక విజువల్ ట్రీట్… ఒక చరిత్రాత్మక కాంబినేషన్.

అయితే చిన్న మెలిక…

ఈ కల నెరవేరాలంటే లోకేష్ బిజీ షెడ్యూల్‌ను ఒకసారి ఓవర్‌కం చేయాలి.

‘ఖైదీ 2’,

‘విక్రం 2’,

‘రోలెక్స్ స్పిన్ ఆఫ్’,

‘కూలీ 2’,

‘లియో 2’… ఇలా షెడ్యూల్ ఫుల్.

కానీ ఎప్పుడైనా ఓ చాన్స్ కలిగితే, ఈ కల నిజమైతే…

ఇది కేవలం ఓ సినిమా కాదు – ఇది సౌత్ ఇండియన్ సినిమా చరిత్రలో ఒక పెద్ద అధ్యాయం అవుతుంది.

, , , ,
You may also like
Latest Posts from