ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణాలు వచ్చేసాయి. రామ్‌ చరణ్‌(Ram Charan) బర్త్‌ డే సందర్భంగా తన కొత్త సినిమా (RC16) నుంచి ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. ఈ లుక్ లో అదిరిపోయే మాస్‌ గెటప్‌లో చెర్రీ కనిపిస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu Sana) చరణ్ ని కొత్తగా ప్రెజెంట్ చేసారు.

మల్టీ స్పోర్ట్స్‌ డ్రామా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు పాన్‌ ఇండియా రేంజ్‌లో ఈ ప్రాజెక్ట్‌ రానుందని అర్దమవుతోంది. అలాగే ఈ మూవీకి ‘పెద్ది’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ‌ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌( Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు, కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్(Shiva Rajkumar), బాలీవుడ్‌ నటుడు దివ్యేందు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో క్రికెట్, కుస్తీ గురించే కాకుండా… మరికొన్ని ఇతర స్పోర్ట్స్‌ గురించిన ప్రస్తావన కూడా ఉంటుందని తెలిసింది.

‘జైలర్‌’ ఫేమ్‌ కెవిన్ కుమార్‌ ఈ యాక్షన్ సీక్వెన్స్ కు కొరియోగ్రఫీ చేయనున్నారు. సుకుమార్‌ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్‌ల సమర్పణలో వృద్ధి సినిమాస్‌ పతాకంపై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు.

‘పెద్ది’ సినిమాను ఈ ఏడాదే రిలీజ్‌ చేసే అవకాసం ఉంది. అలాగే ఈ సినిమాకు సంగీతం ఏఆర్‌ రెహమాన్ అందిస్తున్నారు.

, , , , ,
You may also like
Latest Posts from