రామాయణం ఎన్ని సార్లు చూసినా, విన్నా అమృతమయంగా ఉంటుందని హిందువులు అంటూంటారు. అందుకే వాల్మికీ రామాయణాన్ని ఎంతమంది రాసినా మళ్లీ మళ్లీ రాస్తూనే ఉన్నారు. అలాగే సినిమాలు సైతం వస్తూనే ఉన్నాయి.  అయితే మన రామాయణాన్ని మన దేశంలో తెరకెక్కించటం పెద్ద విశేషం కాదు. విషయమూ కాదు. కానీ  జపాన్ లో యానిమేషన్ లో చిత్రీకరించి రిలీజ్ చేస్తే అక్కడ ఘన విజయం సాధించింది. అది కూడా 1992 లోనే. ఇప్పుడా మూవిని మన దేశ భాషల్లోకి డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు వెర్షన్ ట్రైలర్ రిలీజైంది.

రామాయణ: ద లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’ అనే టైటిల్ తో ఈ  యానిమేటెడ్  మూవీ తెరకెక్కించారు.

వాల్మీకి రామాయణం ఆధారంగా తీసిన సినిమాల్లో ఈ జపనీస్ మూవీ వన్ ఆఫ్ ది బెస్ట్ అని అంటారు విశ్లేషకులు!

1980లో జపనీస్ యానిమేటర్ యుగో సాకో తొలిసారి మనదేశాన్ని సందర్శించారు. ఆ టైంలో రామాయణాన్ని విజువల్ గా చూపిద్దామనే ఆలోచన ఆయనకు వచ్చింది.

ఆ తర్వాత దశాబ్ద కాలంలో దాదాపు 60 సార్లు భారతదేశానికి వచ్చివెళ్లారు.

1985లో ఈయన అయోధ్యని దర్శించినప‍్పుడు.. రామాయణాన్ని డాక్యుమెంటరీగా తీయాలని ఫిక్స్ అయ్యారు.

జపనీస్ రామాయణాన్ని 1992లోనే రూ.80 కోట్ల జపనీస్ యెన్ తో నిర్మించడం విశేషం.

ఎందుకు యానిమేషన్ లో తీయాల్సి వచ్చిందో ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘రాముడు దేవుడు. ఎవరైనా యాక్టర్ కంటే యానిమేషన్ లో తీస్తేనే బెస్ట్’ అని సాకో చెప్పుకొచ్చారు.

రామాయణ ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ’’ జనవరి 24 న దేశవ్యాప్తంగా రిలీజ్ కానుంది.  

You may also like
Latest Posts from