బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్… ‘రామాయణం’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్ నితీష్ తివారి మహా ఇతిహాసం రామాయణం ఆధారంగా ఈ సినిమాని గ్రాండ్ స్కేల్లో తెరకెక్కించనున్నారు.
ఈ సినిమాలో శ్రీరాముడిగా రణ్ బీర్ కపూర్, సీతాదేవిగా సౌత్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. ‘కేజిఎఫ్’ హీరో యశ్ ఇందులో రావణుడి పాత్రను పోషించబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ బయటికి వచ్చింది.
ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, యాష్ రావణుడిగా కనిపించనున్నారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే — వీరిద్దరూ ఒకేసారి స్క్రీన్‌పై ఎక్కువ సేపు కలిసి కనిపించబోరట!
బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం —
“వాల్మీకి రామాయణాన్ని యాజటీజ్ ఫాలో అయ్యి ఈ సినిమా తియ్యటానికి మేకర్స్ కట్టుబడి ఉన్నారు. అసలు మూలకథలో శ్రీరాముడు, రావణుడు చాలా కాలం పాటు ఒకరిని ఒకరు కలవరు. వారి కథలు వేరుగా సాగుతాయి. అందుకే సినిమాలో కూడా వాళ్లిద్దరి స్క్రీన్ షేరింగ్ పరిమితంగానే ఉంటుంది. రావణుని గురించి రాముడు అసలు మొదటి తెలిసేది సీత హరించబడిన తర్వాతే. వీరిద్దరూ ఆ తర్వాత ముఖామఖి కలుసుకునేది రావణ లంక యుద్ధ భూమిపైనే.”
అంటే ఒకవైపు శ్రీరాముని ధర్మ యాత్ర, మరోవైపు రావణుని అహంకార చరిత్ర — ఇవి పరస్పర విరుద్ధ గాథలుగా సాగి, చివరికి ఓ మహాసంగ్రామంలో మిళితమవుతాయన్నమాట! అప్పటిదాకా వీళ్లద్దరి కలవరు.
కాగా రామాయణం పార్ట్ వన్ లో యశ్ కనిపించేది కొద్ది సమయం మాత్రమేనని, పార్ట్ 2 మొత్తం రావణుడిగా యష్ పాత్ర పైనే కథ నడుస్తుందని అంటున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ VFX కంపెనీ DNED పనిచేస్తోంది. ఈ మూవీ కోసం సరికొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నారు.
ఈ కథన రూపంలో చెప్పే ప్రయత్నం రామాయణాన్ని మరో లెవెల్‌కి తీసుకెళ్లనుంది. మరి స్క్రీన్‌పై ఈ గొప్ప పాత్రల సంభాషణలు, వారి పాత్రల మధ్య ఉంటే కాంప్లిక్ట్ — ఎంత గంభీరంగా ఉండబోతుందో చూడాలి!