
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా కెరీర్ గ్రాఫ్ పీక్స్‌లో కొనసాగుతోంది. ఇప్పుడు బాలీవుడ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన సూపర్‌హీరో సినిమా క్రిష్ 4లో హీరోయిన్గా నటించేందుకు ఆమె పేరు వినిపిస్తోంది. హృతిక్ రోషన్ సరసన జోడీగా కనిపించే అవకాశముందని ఇండస్ట్రీ బజ్.
ప్రస్తుతం క్రిష్ 4 ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. 2026 మధ్యలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం. రష్మికా జాయిన్ అవుతున్నట్టూ త్వరలోనే అధికారిక అప్డేట్ రావచ్చని అంచనా.
ఇక రష్మికా షెడ్యూల్ కూడా హెక్టిక్‌గా ఉంది. Animal Park, కాంచన 4, అల్లు అర్జున్–దీపికా పదుకొణె కాంబోలో వస్తున్న AA22XA6 వంటి భారీ ప్రాజెక్టులు ఆమె ఖాతాలో ఉన్నాయి.
పుష్ప 2లో తన నటనతో మరోసారి మెప్పించిన రష్మికా, హిందీలో Goodbyeతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత Mission Majnu, Animal, Chhaavaలో నటించింది. సల్మాన్ ఖాన్‌తో చేసిన సికందర్ పెద్దగా సక్సెస్ కాకపోయినా, రష్మికా క్రేజ్ మాత్రం ఆగలేదు.
ప్రస్తుతం ఆమె Thama మరియు Cocktail 2లో నటిస్తోంది.
‘క్రిష్ 4’ ప్రాజెక్ట్‌లో రష్మిక చేరితే, ఆమె పూర్తి స్థాయి పాన్ ఇండియా హీరోయిన్గా మారడం ఖాయం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సూపర్ హీరో చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
