ఈ మధ్యన స్టార్స్ ని కాకుండా కంటెంట్ ని నమ్ముకున్న సినిమాలు ఓటిటిలో చాలా వస్తున్నాయి. వాటిలో ఎక్కువ భాగం సక్సెస్ అవుతున్నాయి కూడా. అదే క్రమంలో ఇంద్రజ, కరుణ కుమార్‌ (దర్శకుడు) తదితరులు ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘కథా కమామీషు’ (Katha Kamamishu). గౌతమ్‌- కార్తిక్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్టైయిట్ గా ఓటీటీ ‘ఆహా’ (Aha)లో రిలీజైంది. రిలీజై దాదాపు నెలా పదిహేను రోజులు అవుతున్నా ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి చర్చలు జరగటం విశేషం. యూత్ ఈ సినిమాలో కంటెంట్ ని డిస్కస్ చేస్తున్నారు. ఓ సినిమా జనాల్లోకి వెళ్లింది అనటానికి ఇంతకు మించిన నిదర్శనం ఏమంటుంది.

ఇక ఈ చిత్రం ప్రేమ – పెళ్లి అనే రెండు అంశాలను కలుపుకుంటూ సాగే కథ తో రూపొందింది. ఆయా సందర్భాలకు తగినట్టుగా ఒక్కటైన నాలుగు జంటల చుట్టూ తిరిగే కథ ఇది. పెళ్లి తరువాత ఏ జంట ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయవలసి వస్తుంది అనేది ఈ కథలో మెయిన్ కాన్సెప్టు. ఇదే యూత్ కు నచ్చుతోంది.

ముఖ్యంగా పెద్దల అంగీకారంతో జరిగిన పెళ్లి .. అందుకు వ్యతిరేకంగా జరిగిన పెళ్లి .. కొన్ని కారణాల వలన జరిగిన రెండో పెళ్లి .. ఇలా పెళ్లి అనేది ఆయా జంటలను ఎలా ప్రభావితం చేస్తుందనేది చెప్పడానికి దర్శక ద్వయం గౌతమ్- కార్తీక్ ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. ఒకే ఊర్లో .. ఈ నాలుగు కుటుంబాల చుట్టూనే ఈ కథ తిరుగుతూ ఉంటుంది. ఈ నాలుగు ట్రాకులను రసవత్తరంగా అల్లుకోవటంతో ఎక్కడా బోర్ కొట్టకుండా సీన్స్ పరిగెత్తాయి.

స్టోరీ లైన్ ఏమిటి

బ్యాంకులో జాబ్ చేసే స‌త్య (వెంక‌టేష్ కాకుమాను) కి త‌ల్లి చిన్న‌త‌నంలోనే చ‌నిపోతుంది.అన్న‌య్య‌ల‌తో పాటు తండ్రి ఏ ప‌ని పాట లేకుండా స‌త్య సంపాద‌న‌పై ఆధార‌ప‌డి బ‌తుకుతుంటారు. బ్యూటీ పార్ల‌ర్‌లో ప‌నిచేసే ఉష‌ను (హ‌ర్షిణి) ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు స‌త్య. పెళ్లైన కొద్ది రోజుల్లోనే ఉష‌తో స‌త్య మాట్లాడటం ఎందుకు మానేశాడు? పెళ్లికి ముందు ఉన్న ఆనందం అత‌డికి ఎందుకు దూర‌మైంది అన్న‌ది ఓ క‌థ‌…

దివ్య (కృతిక‌రాయ్‌) ఆన్‌లైన్‌ ర‌మ్మీ ఆట‌లో మూడు ల‌క్ష‌లు పొగొట్టుకుంది. బాలుతో(కృష్ణ ప్ర‌సాద్‌) పెళ్లి జ‌రుగుతుంది. భ‌ర్త‌కు తెలిసేలోపు బ్యాంకు లోన్ తీసుకొని ర‌మ్మీ ఆట‌లో పొగొట్టుకున్న అప్పును తీర్చేయాల‌ని అనుకుంటుంది. లోన్ వ‌చ్చిందా? దివ్య అప్పు విష‌యం బాలుకు తెలిసిందా? లేదా? అన్న‌దే జంట క‌థ‌.

అలాగే క‌ల్ప‌న (ఇంద్ర‌జ‌) పోలీస్ ఆఫీస‌ర్‌. భ‌ర్త చ‌నిపోతాడు. ఓ బాబు ఉంటాడు. క‌ల్ప‌న‌ను రెండో పెళ్లి చేసుకుంటాడు శ్రీధ‌ర్ (క‌రుణ కుమార్‌). అత‌డికి అప్ప‌టికే పెళ్ల‌వుతుంది. భార్య అత‌డిని వ‌దిలిపెట్టి వెళ్లిపోతుంది. రెండో పెళ్లి నిర్ణ‌యం త‌ప్ప‌ని క‌ల్ప‌న ఫీల‌వ్వ‌డానికి కార‌ణం ఏమిటి? భార్య‌ను శ్రీధ‌ర్ ఎందుకు అర్థం చేసుకోలేక‌పోయాడు అన్న‌ది మ‌రో జంట కథ.

వీటిన్నటికీ భిన్నమైనది ఓ యువ జంట‌ క‌థ‌. కిర‌ణ్ (మెయిన్‌) చేసిన టిక్‌టాక్ వీడియోలు చూసి స్ర‌వంతి (శృతిరాయ్‌) అత‌డితో ప్రేమలో పడుతుంది. పెద్ద‌ల‌ను ఎదురించి ఆర్య‌స‌మాజ్‌లో పెళ్లిచేసుకుంటారు. పెళ్లి త‌ర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కు దూర‌మ‌య్యాన‌నే ఫీలింగ్‌తో భ‌ర్త‌ను స‌రిగ్గా ప‌ట్టించుకోదు. దాంతో వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయి. ఆ త‌ర్వాత ఏమైంది అన్నది మిగతా కథ.

ఎందుకు చూడాలి ఈ సినిమాని

మనందరి జీవిలాల్లో జరిగే విషయాలను చూపుతూ, చిన్న చిన్న విష‌యాలే కొన్ని సార్లు ఏ విధంగా పెద్ద స‌మ‌స్య‌లుగా మారిపోతాయ‌న్న‌ది అన్నది చాలా క్లియర్ గా చెప్పారు. అలాగని ఎక్కడా కథ,కథనంలో ఓవ‌ర్ సెంటిమెంట్‌, మెలోడ్రామా లేకుండా సింపుల్ ఎమోష‌న్స్‌తో ఈ సినిమాలో చూపించారు.

చూడచ్చా

సింపుల్ మెసేజ్‌తో కూడిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ గా తెరకెక్కిన ఈ చిత్రం లెంగ్త్ రెండు గంట‌ల లోపే. చక్కగా ఫ్యామిలీతో క‌లిసి చూడొచ్చు

, , ,
You may also like
Latest Posts from