ఓ సినిమా ఓ మాదిరి టాక్ తెచ్చుకుని, హిట్టైతే ఆ హీరోలను పట్టుకోవటం కష్టం. వాళ్లు రెమ్యునరేషన్స్ అమాంతం పెంచేస్తారు. అలాంటిది పుష్ప 2 వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాక అల్లు అర్జున్ ని ఆపేదెవరు…ఆయన చుట్టూ తమిళ,తెలుగు నిర్మాతలు ప్రదిక్షణాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయన ఎంత రెమ్యునరేషన్ ఎంత డిమాండ్ చేస్తున్నారనేది హాట్ టాపిక్ మారింది.

ప్రస్తుతం అ ల్లు అర్జున్ – అట్లీ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రాబోతోంద‌ని అంతటా వినిపిస్తున్న మాట‌. ఓ అఫీషియ‌ల్ స్టేట్‌మెంట్ కూడా త్వ‌ర‌లోనే రాబోతోంద‌ని చెప్తున్నారు. అల్లు అర్జున్ – అట్లీ అన‌గానే కాంబో ప‌రంగా ఎక్సపెక్టేషన్స్ మామూలుగా ఉండవు. దానికి తోడు అట్లీ కూడా ఫామ్ లో ఉన్నాడు. అల్లు అర్జున్ సంగతి అసలు చెప్పక్కర్లేదు.

అందుతున్న సమాచారం మేరకు అల్లు అర్జున్ కి కథ చెప్పడం ప్రాజెక్ట్ లాక్ అవ్వడం జరిగింది. అల్లు అర్జున్ అట్లీ కాంబోలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా బడ్జెట్ లెక్కలు ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాయి. అల్లు అర్జున్, అట్లీ కాంబో సినిమా 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని వినికిడి.

ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కి 250 కోట్లు, డైరెక్టర్ అట్లీకి 100 కోట్ల రెమ్యునరేషన్ గా ఇస్తున్నట్టు టాక్. అంటే ఇక్కడికే 350 కోట్లు నిర్మాతకు లేచిపోతాయి.

అయితే ఇప్పుడు బ‌న్నీ మార్కెట్ ఇప్పుడు బాగా పెరిగింది కాబ‌ట్టి, ఆమాత్రం ఇవ్వ‌డానికి సైతం నిర్మాత‌లు రెడీనే అంటున్నారు.అయితే అట్లీకి రూ.100 కోట్లు ఇవ్వాలనే దగ్గరే సమస్య వస్తోందిట.

, ,
You may also like
Latest Posts from