తమిళ స్టార్ హీరో సూర్య (Suriya) కొత్త సినిమా ‘రెట్రో’. ఈ చిత్రం తాజాగా తెలుగు టీజర్‌ విడుదలైంది. గతేడాది కంగువ సినిమాతో అభిమానులను నిరాశ పరిచిన సూర్య.. ఇప్పుడు ప్రేమ, యాక్షన్‌ అంశాలతో తన కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారని అర్దమవుతోంది.

పూజా హెగ్డే, సూర్య జంటగా ఈ చిత్రాన్ని కార్తీక్‌ సుబ్బరాజ్‌ తెరకెక్కించారు. భారీ బడ్జెట్‌తో 2డీ ఎంటర్‌టైన్‌మెంట్, స్టోన్‌ బెంచ్‌ ఫిల్మ్స్‌ సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. మే 1న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.

డీ గ్లామర్ లుక్‌తో ఉన్న హీరోయిన్ పూజా హెగ్డేతో సూర్య మాట్లాడుతుంటాడు. నీతో ప్రేమ కోసం రౌడీయిజం, గుండాయిజం అన్ని వదిలేస్తున్నానని.. మీ నాన్న దగ్గర పనిచేయడం కూడా మానేస్తానని చెప్పడం బాగుంది. ఓవైపు ఇంటెన్స్ యాక్షన్ చూపిస్తూనే.. ప్రేమకథ కూడా ఉందనే విషయాన్ని టీజర్ చెప్పకనే చెప్పింది.

https://youtu.be/8u6sxVEqXYI?si=epLOSgDMxA__g5F6

కార్తిక్ సుబ్బరాజు సినిమాలన్నీ సమ్‌థింగ్ డిఫరెంట్ అనేలా ఉంటాయి. సూర్యతో చేసిన ‘రెట్రో’ టీజర్ చూస్తుంటే హిట్ కళ కనిపిస్తోందంటున్నారు అభిమానులు.

ఈ సినిమా సక్సెస్ అయితే సూర్యకి హీరోగా కమ్ బ్యాక్ దొరుకుతుంది. గత మూడేళ్లుగా ‘కంగువ’ కోసం పనిచేశారు. కానీ ఫలితం అనుకున్నట్లు రాలేదు. ప్రేక్షకులు చాలా డిసప్పాయింట్ అయ్యారు. ‘బాహుబలి’లా తీద్దామనుకున్నారు కానీ మూవీ బెడిసికొట్టేసింది. ఇప్పుడు ‘రెట్రో’ హిట్ కావడం అనేది సూర్య కెరీర్‌కి చాలా కీలకం.

, ,
You may also like
Latest Posts from